Newsసమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా..?..స్టార్ హీరోలు కూడా...

సమంత ఒక్క పోస్ట్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా..?..స్టార్ హీరోలు కూడా వేస్ట్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్గా పాత్రలు చేస్తూనే పలు బ్రాండ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం ఈ మధ్యకాలంలో అలవాటైపోయింది. మరీ ముఖ్యంగా మన ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు స్టార్ బ్యూటీస్ ఇదే పనిలో బిజీ అయిపోతున్నారు. ఎవరో ఒకరో ఇద్దరో తప్పిస్తే మిగతా హీరోయిన్ అందరు సైడ్ బిజినెస్ గా బ్రాండ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న లేడీస్ సూపర్ స్టార్ సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దానికి ఏకంగా కోట్లల్లో లాభాలు అందుకుంటుంది అన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

సోషల్ మీడియాలో సమంతకి హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది . ఇంస్టాగ్రామ్ లో రెండున్నర కోట్ల మంది ఆమె ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ లో కోటి మంది ఫాలో అవుతున్నారు . ఇక ఫేస్బుక్లో అయితే సుమారు నాలుగు కోట్ల 50వేల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంత సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టి పెట్టగానే మిలియన్ వ్యూయ్స్ వస్తాయి .

ఈ క్రమంలోనే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ క్యాష్ చేసుకున్న సదరు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఆమెకు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరి తమ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయించుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో సమంత ఒక్క పోస్ట్ పెడితే దాదాపు 50 లక్షలు పారితోషకం తీసుకుంటుందట . ఈ లెక్కన చూసుకుంటే సమంతకి నెలకి ఎలా కాదనుకున్న నాలుగైదు యాడ్స్ వచ్చేస్తూ ఉంటాయి . ఈ క్రమంలోనే సమంత సినిమాల రెమ్యూనరేషన్ కంటే ఇదే ఎక్కువగా ఉంది అంటున్నారు జనాలు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంత రెమ్యూనరేషన్ వైరల్ గా మారింది . కాగా రీసెంట్గా సమంత చేసిన శాకుంతలం సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోనే సమంత తన ఆశలన్నీ ఖుషి సినిమా పైనే పెట్టుకొని ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news