సాధారణంగా.. ఎన్టీఆర్ .. ఏదైనా చేయాలని అనుకుంటే.. వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. అది కష్టమైనా.. సరే.. సాధించి తీరుతారనే పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఒక సందర్భంలో మాత్రం అక్కినేని వెనక్కి తగ్గారు. శివ లీలలు
అనే టైటిల్‌తో ఒక సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నారు. అప్పటికే.. అన్నగారు శివుడి వేషంతో పలు సినిమాలు చేసి ఉన్నారు. వీటిలో దక్ష యజ్ఞం
ఒకటి. ఇదిపూర్తి పౌరాణిక చిత్రం.
ఇది బాగా హిట్టయింది. ఇది అన్నగారు తీసిన సినిమా కాదు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే.. అన్నగారు శివ లీలలు.. తీసే ప్రయత్నం చేశారు. దీనిలో శివ తత్వాన్ని మొత్తం చెప్పాలనేది అన్నగారి ప్లాన్. ఇదే విషయంలో దర్శకుడు కమలాకర కామేశ్వరరావుతోనూ ఆయన చర్చించారు. ఆయనతో ఈ సినిమా తీయాలనేది అన్నగారి ప్లాన్. అప్పట్లో గుమ్మడి, ఎస్వీ రంగారావు, జమున.. వంటి వారు.. ఫుల్ బిజీ.
దీంతో తన సినిమాకు ఎట్టి పరిస్థితిలో వారు నటించాలని అనుకున్న అన్నగారు.. వారికి అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. వాస్తవానికి కథ రెడీ కాలేదు.. ఫైనల్‌కాలేదు. కానీ, ఆ సమయంలో అన్నగారికి అలా అనిపించింది. అప్పటి సంగీత దర్శకుడు టీవీ రాజు అంటే.. అన్నగారికి అభిమానం. దీంతో ఆయననే సంగీత దర్శకుడిగాను నియమించుకున్నారు. ఈయనకు కూడా అడ్వాన్సులు ఇచ్చారు.
ఇలా మొత్తంగా.. సినిమాకు సంబంధించి కథ ప్రిపేర్ చేసుకోకుండానే.. అన్నగారు అడ్వాన్సులు ఇచ్చేశా రు. ఇక, కథ మీద కూర్చునే సరికి.. అన్నగారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అన్నగారి కుమారుడు చనిపోయారు. సెంటిమెంటుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అన్నగారు.. ఈ విషాదానికి కారణం.. శివపాత్రేనన్న పండితుల మాట నమ్మి.. శివలీలలు సినిమాను అక్కడితో వదిలేసుకున్నారు. దీంతో అన్నగారు దాదాపు 10 లక్షల వరకు నష్టపోయారని అంటారు.