అన్నగారు ఎన్టీఆర్ కుమారుడిగా అరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ .. అనతి కాలంలోనే తనసత్తా నిరూపించుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన.. మంగమ్మగారి మనవడు(1984) తర్వాత.. బాలయ్యకు పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయి. కుటుంబ కథా చిత్రాల్లో బాలయ్యకు మంచి పేరు తెచ్చినవి కూడా చాలానే ఉన్నాయి. ఇక, మంగమ్మగారి మనవడు సినిమాలో సుహాసిని హీరోయిన్.
షూటింగ్ అంతా కూడా.. రాజమండ్రి.. పరిసర ప్రాంతాల్లోనే చేశారు. సుహాసిని ఉండేది చెన్నై.(అప్పట్లో మద్రాస్) దీంతో వచ్చి పోయేందుకు ఇబ్బందిగా ఉండేది. దీంతో బాలయ్య, భానుమతి, సుహాసినిలకు రాజమండ్రి సిటీలో ప్రత్యేకంగా బస ఏర్పాటు చేశారు. ఇలా.. ఈ సినిమా మొత్తం నడిచింది. అయితే.. షూటింగ్ అయిపోయిన తర్వాత.. సుహాసినికి బాలయ్య ఖరీదైన వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చారు.
అంతే!ఇంకేముంది.. సినీ పత్రికలు వీరికి ప్రేమను ముడిపెట్టాయి. తొలి సినిమాతోనేప్రేమలో పడ్డ హీరో హీరోయిన్లు!అంటూ క్యాప్షన్‌పెట్టి.. గిఫ్ట్ ఇస్తున్న ఫొటోలు ముద్రించాయి. బాలయ్యకు పత్రికలు చదివే అలవాటు లేదు. అప్పట్లో సుహాసినికి తెలుగు రాదు. మొత్తానికికోడి రామకృష్ణ, భానుమతిల దృష్టికి ఈ వార్తలుచేరాయి. భానుమతి నిజమేనేమో.. అనుకున్నారు. తనకు గతంలో జరిగిన అనుభవం దృష్ట్యా..!
కానీ ఈ సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ ఖండించారు.
విషయం అన్నగారి వరకు వెళ్తే.. తన పీక కోసేస్తారని ఆయన హడిలి పోయారు. అంతే.. వెంటనే సదరుపత్రిక రిపోర్ట్‌ను పిలిచి.. ఏమయ్యా.. చిన్న గిఫ్ట్ ఇస్తే.. ఇలా రాస్తావా? రిజాయిండర్ వెయ్యి. రామారావుగారికి తెలిస్తే.. నీ పత్రిక లేపేస్తారు! అని హెచ్చరించారట. దీంతో మరుసటి రోజు.. రిజాయిండర్ వేసుకున్నారట. అయితే.. కథనాలు మాత్రం వస్తూనే వున్నాయి. సినిమా సూపర్ హిట్‌కావడం వెనుక.. ఈ గ్యాసిప్‌లు బలంగా పనిచేశాయని.. కోడి ఓ సందర్భంలో మంగమ్మ గారి మనవడు.. సినిమాపై రియాక్ట్ అవుతూ చెప్పారు.