Moviesశోభ‌న్‌బాబుకు జ‌య‌ల‌లితతో పాటు ఆ హీరోయిన్‌తోనూ ప్రేమాయ‌ణం న‌డిచిందా…!

శోభ‌న్‌బాబుకు జ‌య‌ల‌లితతో పాటు ఆ హీరోయిన్‌తోనూ ప్రేమాయ‌ణం న‌డిచిందా…!

ఆరడుగుల ఆంధ్రా అందగాడు శోభన్ బాబు అంటే అప్పట్లో అమ్మాయిలకు పిచ్చ క్రేజ్‌. శోభన్ బాబు అందానికి అప్పట్లో మహిళలు ఫిదా అయిపోయేవారు. ఆయన వయసు పైబడి సినిమాలు చేశాక కూడా శోభన్ బాబు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే ముద్దుల‌ మొగుడుగా శోభన్ బాబు చేసిన పాత్రలకు అప్పట్లో మంచి పాపులారిటీ ఉండేది. ఆ తర్వాత శోభన్ బాబు పాత్రను టాలీవుడ్ లో జగపతిబాబు సమర్థవంతంగా పోషించారు అన్న పేరు తెచ్చుకున్నారు.

ఇద్దరు ప్రియురాళ్ల ముద్దుల లవర్ గాను.. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగాను శోభన్ బాబు నలుగుతుంటే నిజంగా వెండి తెరకే ఒక అందం వచ్చేది.. అన్నంత గొప్ప పేరు శోభన్ బాబుకి ఉండేది. ఇక శోభన్ బాబు దివంగత‌ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య ఉన్న ప్రేమాయణం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వారిద్దరి గురించి తెలిసిన వాళ్ళు వారిద్దరి ఎఫైర్ నిజమే అంటూ ఉంటారు.

జయలలిత స్టార్ హీరోయిన్గా ఉన్నప్పటికీ శోభన్ బాబు స్మాల్ రేంజ్ హీరో. అప్పట్లో శోభన్ బాబు జయలలిత అందాన్ని చూసి ముగ్ధుడు అయిపోయారు. కనీసం జయలలితతో ఒక్క సినిమా అయినా చేస్తే చాలు అనుకునేవారు. అయితే జయలలిత తల్లి మాత్రం నువ్వు ఒక గొప్ప స్టార్ హీరోయిన్ వి.. ముక్కు మొఖం తెలియని హీరోతో చేస్తే నీ ప‌రువు ఏమవుతుంది ? అంటూ శోభన్ బాబు పక్కన ఆమెను హీరోయిన్గా చేయనిచ్చేవారు కాదని టాక్‌. ఎప్పుడు అయితే శోభన్ బాబుపై జయలలిత ఇష్టాన్ని పెంచుకుందో అప్పటినుంచి పిచ్చిపిచ్చిగా ప్రేమించింది.

అయితే శోభన్ బాబు తన గురువుగారి కుమార్తెనే వివాహం చేసుకున్నారు. ఆమెకు అన్యాయం చేయడం ఇష్టం లేక జయలలితతో బంధాన్ని తెంచుకున్నారు అన్న అది నిజం. ఇక జయలలిత బంధం నుంచి విముక్తి కలిగాక శోభన్ బాబు మరో హీరోయిన్ తో కూడా ప్రేమలో పడ్డారు అన్న పుకార్లు అయితే ఉన్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు సుహాసిని. సుహాసిని క‌మ‌ల్‌హాస‌న్ అన్న చారుహాస‌న్ కుమార్తె. ఆమె త‌మిళంలో
ఉద‌రి పూక‌ల్ ( రాలిన పూలు) సినిమాతో హీరోయిన్ అయ్యింది.

కెరీర్ స్టార్టింగ్లో సుహాసిని – శోభ‌న్‌బాబు కాంబినేష‌న్లో ఎక్కువ సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య ఎఫైర్‌పై పుకార్లు వ‌చ్చేవి. ఇక ఆ టైంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని ఒక్క‌టే వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. శోభ‌న్‌బాబు అయితే సుహాసిని గురించి చెపుతూ నా హీరోయిన్ సుహాసిని అంటే.. సుహాసిని నా హీరో శోభ‌న్‌బాబు గారు అని చెప్పేద‌ట‌. అంత మంచి స్నేహం వారి మ‌ధ్య ఉండేది. ఆ త‌ర్వాత ఆమె చిరంజీవి, బాల‌య్య‌తో సినిమాలు చేయ‌డం ప్రారంభించాక శోభ‌న్‌బాబుతో సినిమాలు త‌గ్గిపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news