ఎస్ ఇప్పుడు టాలీవుడ్లో ఇదే చర్చ నడుస్తోంది. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చాక బాగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ క్రమంలోనే అక్కినేని అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఆమెను బాగా టార్గెట్ చేశారు. విడాకుల తర్వాత కూడా అక్కినేని ఫ్యామిలీ మీద కోపంతో అన్నట్టుగా సమంత బిహేవియర్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఆమె పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్‌లో ఎంతలా రెచ్చిపోయి అందాలు ఆరబోసిదో చూశాం. ఇక యశోద సినిమా వచ్చింది. థ్రిల్లర్ సినిమాగా వచ్చిన యశోద ఓ మోస్తరుగా జనాలను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆమె శాకుతలం సినిమా చేస్తోంది. గుణశేఖర్ దర్శకుడు. దిల్ రాజు కూడా ఓ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాకు అనుకున్నంత బజ్ లేదు.
పైగా మూడేళ్లుగా సినిమాను ఎంతో చెక్కి చెక్కీ మరీ తీశాడు గుణశేఖర్. ఈ సినిమా ప్లాప్ అయితే సమంత పని అయిపోయిందన్న ప్రచారం జరుగుతుంది. అందుకే సమంత చాలా కష్టపడుతూ ప్రమోషన్లు చేస్తోంది. అదే టైంలో ఈ సినిమా ప్రమోషన్లలో సానుభూతి కోసం అన్నట్టుగా తన వ్యక్తిగత విషయాలను కూడా బయట పెడుతోంది.
నాగచైతన్య, అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పరోక్షంగా, ప్రత్యక్షంగా మాట్లాడడంతో పాటు వారి నుంచే తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానన్న ధోరణితోనే ఆమె మాటలు ఉన్నాయి. ఇక వ్యక్తిగత విషయాలు లీక్ చేయడంతో పాటు చివరకు విడాకులకు కారణాలను కూడా ఆమె బయటపెడుతూ ఎలాగైనా ఈ సినిమాకు జనాలను రప్పించుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టుగానే కనిపిస్తోంది.
సినిమా తేడా కొడితే అందరికి సమంత టార్గెట్ అవుతుంది. అదే సినిమా హిట్ అయితే సమంత గర్వంగా తలెత్తుకోవడంతో పాటు విడాకుల తర్వాత కూడా తన క్రేజ్ తగ్గలేదని చెప్పుకోవచ్చు. అందుకే సమంత ఇలా కాస్త డౌన్ అయ్యి పర్సనల్ విషయాలు లీక్ చేస్తోందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.