మహనటి భానుమతి అనేక పాత్రలు వేశారు. వీటిలో రాణి నుంచి ప్రేమికురాలు వరకు.. వేశ్య నుంచి నర్తకి వరకు.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. నిజానికి కన్యాశుల్కం, అమరశిల్పి జక్కన్న, అనార్కలి సినిమాలు ఆమెను దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ పాత్రలను అల్లారని అంటారు. అయితే.. వాటిలో ఎందు కో ఆమె నటించలేదు. కన్యాశుల్కంలో అన్నగారు నటించగా.. మిగిలిన రెండు సినిమాల్లోనూ అక్కినేని ఉన్నారు.
ఇక, ఈ సినిమాలే కాదు.. అనేక సినిమాల్లో కొన్నిపాత్రలను భానుమతి పోగొట్టుకున్నారు. ముఖ్యంగా శ్రీకృ ష్ణ సత్య సినిమాలో సత్య భామపాత్రకు భానుమతిని అడిగారు. అయితే.. ఆమె వీలుకాదన్నారు. నిజానికి భానుమతి వేయాలని అనుకున్న పాత్రల్లో సత్య భామ ఒకటి. మంచి పొగరు.. వగరు ఉన్న పాత్ర కావడంతో పాటు.. నటనకు ఎంతో స్కోప్ ఉన్న పాత్ర కూడా సత్యభామ. అయితే.. భానుమతి మాత్రం ఎక్కడా నటించలేక పోయారు.
అదేవిధంగా.. సీత పాత్రను కూడా భానుమతి వేయలేక పోయారు. లవకుశ సినిమాలో సీత పాత్ర వేయాల ని ఆమెను అడిగారు. ముందు ఒప్పుకొన్నా.. తర్వాత ఆమె వద్దన్నారు. అప్పటికి కొంత బిజీగా ఉండడం ఒకకారణమైతే.. సీతగా నటించేందుకు ఏముంటుంది? ఏడుస్తూ కూర్చోవడమేగా!అని వ్యాఖ్యానించేవారు. దీంతో ఆమె సీత పాత్రలకు దూరంగా ఉన్నారు.
అలాగే.. లక్ష్మీదేవి పాత్రలకు కూడా దూరంగా ఉన్నారు. ఈ కిరీటాలు పెట్టుకుని ఏం నటిస్తాం! అని వ్యా ఖ్యానించేవారట. పైగా.. దేవతా పాత్రల్లో చేయడానికి ఏముంటుంది? అని అనేవారట. దీంతో భానుమతి.. పౌరాణిక సినిమాలకు దాదాపు దూరంగానే ఉండిపోయారు. అయితే.. చిత్రం ఏంటంటే..సత్యభామ పాత్రకు ఆమె మాటలు రాశారు. అవికూడా మహాభారతం అధ్యయనం చేసి మరీ రాయడం.. గమనార్హం. ఆ డైలాగులు జమున నోటి వెంట వస్తుంటే.. ప్రేక్షకులు కుర్చీల్లోంచి కదిలేవారు కాదు! అదీ.. భానుమతి టాలెంట్ అంటారు.