గత నాలుగు సినిమాలుగా చూస్తే నానికి కమర్షియల్ గా అనుకున్న స్థాయి హిట్ రాలేదు. వి, గ్యాంగ్ లీడర్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి అంచనాలు అందుకోలేదు. శ్యాం సింగరాయ, అంటే సుందరానికి థియేటర్లలో రిలీజ్ అయినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఇక నాని కెరీర్ లో తొలిసారిగా రు. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియా సినిమాగా థియేటర్లలోకి వచ్చిన దసరా సినిమా అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే రు. 71 కోట్ల గ్రాస్ వసూలు కొల్లగొట్టింది. ఈ సినిమా నాని కెరీర్లో తొలి రు. 100 కోట్ల సినిమాగా రికార్డుల్లో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు నాని రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు వరకు నాని ఒక్కో సినిమాకు రు. 12 కోట్ల రేషియోలో రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. అయితే ఇప్పుడు కమిట్ అవుతున్న సినిమాలకు రు. 20 కోట్లు అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాని కొత్త సినిమాల మార్కెట్ కూడా బాగా పెరిగిపోతోంది. నాని, మృణాల్ ఠాగూర్ కాంబినేషన్లో కొత్త దర్శకుడు సౌరవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు రు. 35 కోట్లకు అమ్ముడయ్యాయి.
ఇది కూడా కేవలం సౌత్ ఇండియా స్ట్రీమింగ్ వరకే అని తెలుస్తోంది. నాని దసరా సినిమా డిజిటల్ రైట్స్ కేవలం రు. 19 కోట్లకు మాత్రమే అమ్మారు అంటే.. ఇప్పుడు డబుల్ రేటుకు కొత్త సినిమా రైట్స్ అమ్మినట్టు. ఇక హిందీ డబ్బింగ్, నార్త్ ఇండియా డిజిటల్ హక్కులు కూడా కలిపితే మరో పాతిక కోట్ల ఆదాయం ఉంటుంది. ఇక ఆడియో రైట్స్ కోసం కూడా టి సిరీస్ ఏడు కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
అంటే నాని సినిమాకు కేవలం నాని థియేటర్ మీద ఏకంగా రు. 70 కోట్ల ఆదాయం వస్తుందన్నమాట. ఏది ఏమైనా దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత నాని రేంజ్, రెమ్యునరేషన్ ఒక్కసారిగా డబుల్ అయిపోయింది అన్నది వాస్తవం. ఈ క్రమంలోనే కొత్త రెమ్యూనరేషన్‌తో నాని నిర్మాతలకు చుక్కలు కూడా చూపించేస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ హిట్ ట్రాక్ ఇలా కంటిన్యూ అయితే ఓకే.. లేకపోతే మార్కెట్ మళ్లీ ధమాల్‌న కింద పడటం కూడా ఖాయం.