Moviesబిగ్ బ్రేకింగ్: నీహారిక విడాకులు నిజమే.. క్లారిటీ వచ్చేసిందోచ్..!!

బిగ్ బ్రేకింగ్: నీహారిక విడాకులు నిజమే.. క్లారిటీ వచ్చేసిందోచ్..!!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో. వివాహం జరిపిన విషయం మనందరికీ బాగా తెలిసిన విషయమే ఉదయపూర్ ప్యాలెస్ దాదాపు 25 కోట్లు ఖర్చు చేసి మరి గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు . అయితే ఆ బంధాన్ని పట్టుమంటే నాలుగు కాలాల పాటు కూడా నిలుపుకోలేకపోయారు ఈ జంట . రీసెంట్ గానే ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

జొన్నలగడ్డ చైతన్య – నిహారిక సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు . అంతేకాదు చైతన్య నిహారికతో పెళ్లి జరిగిన పిక్స్ డిలీట్ చేసేసాడు . ఈ క్రమంలోనే చైతన్య నిహారికల మధ్య ఏదో యవ్వారం చెడిందని విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఎక్కడో మెగా అభిమానులకు నిహారిక ఇంకా పెళ్లి ఫోటోలు డిలీట్ చేయలేదు అంటే నిహారికకి విడాకులు ఇష్టం లేదు అని ..త్వరలోనే భర్తతో కలవబోతోంది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే కొద్దిసేపటి క్రితమే నిహారిక కూడా సోషల్ మీడియా ఖాతాలో తన పెళ్లికి సంబంధించిన పిక్స్ అన్నిటిని డిలీట్ చేసేసింది . మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్యతో తాళి కట్టించుకునే పిక్స్ ..ఆయనతో క్లోజ్ గా ఉన్న పిక్స్ అన్ని డిలీట్ చేస్తూ .. తాను ఒక్కటే ఉన్న పెళ్లి పిక్స్ ని మాత్రమే డిలీట్ చేయకుండా ఉంచింది . ఈ క్రమంలోని మెగా డాటర్ నిహారిక విడాకులు అనఫిషియల్ గా కన్ఫామ్ చేసినట్లయింది. దీంతో మెగా ఇంట మరో విడాకులు కన్ఫామ్ అంటూ మెగా ఫ్యామిలీని ఏకీపారేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news