త్రిబుల్ ఆర్ సినిమాతో అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ గా మారారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోలు ఇద్దరు తమ తర్వాత సినిమాలపై ఫోకస్ చేశారు. రామ్ చరణ్ తన కెరీర్లో 15వ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. అలాగే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఇక తన 30వ ప్రాజెక్టుకు సంబంధించి వరుసగా అప్డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న తారక్ ఇప్పుడు పెద్ద యుద్ధమే ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా చేయబోతున్నారు. హృతిక్ రోషన్ హీరోగా టైగర్ ష్రాఫ్ లీర్ రోల్లో నటించిన సినిమా వార్. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో పాటు భారీ వసూళ్లు కొల్లగొట్టింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నట్టు నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ ప్రకటించింది. వార్ సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వార్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తే. వార్ సినిమాకు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సీక్వెల్లో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ అటు బాలీవుడ్‌తో పాటు ఇటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తోంది.
వార్ సినిమాకు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఆయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్ ఖరారు అయ్యి చాలా రోజులే అయిందని తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ సమయంలోనే ఆ సినిమా తెలుగు ప్రమోషన్లలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అప్పటికే వార్ సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.