యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అయ్యి 8 ఏళ్లు అవుతోంది. ఒక్కటంటే ఒక్క హిట్ సినిమా లేదు. ఇప్పటికే చేసిన నాలుగు సినిమాల్లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఒక్కటే కాస్త యావరేజ్. తొలి సినిమా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను అన్ని అట్టర్ ప్లాప్. ఎలిజబుల్ బ్యాచిలర్ కూడా ఓ మోస్తరుగానే ఆడింది.
అఖిల్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా ఒక్కటంటే ఒక్క హిట్ రావడం లేదు. తాజాగా ఏజెంట్ అంటూ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు ఈ సినిమాకు ఏకంగా రు. 80 కోట్ల బడ్జెట్ అయ్యింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి షోకే బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా కొన్న వాళ్లందరూ నిండా మునిగిపోనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ నెక్ట్స్ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లితో రెడీ అవుతున్నాడు. వంశీ ఈ సంక్రాంతికి కోలీవుడ్ హీరో విజయ్‌తో వరీసు ( తెలుగులో వారసుడు) సినిమా తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ మార్కులు వేయించుకుంది. అసలు వంశీ పైడిపల్లి అంటేనే రాడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఎంత మంచి కథ అయినా పరమ రొటీన్‌గా, పాత చింతకాయ పచ్చడిలా తెరకెక్కించడంలో మనోడిది అందెవేసిన చేయి.
ఇప్పుడు అఖిల్‌తో వంశీ సినిమా అంటే మనం కొత్తగా ఆశించేది ఏం ఉండదని.. అఖిల్ ఖాతాలో మరో రొడ్డ కొట్టుడు సినిమా పడడం ఖాయమనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అఖిల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. కథ ఫైనల్ స్టేజ్‌లో ఉందంటున్నారు. అఖిల్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నా కూడా కథలు, డైరెక్టర్ల ఎంపికలో మనోడిలో ఏ మాత్రం మార్పు వస్తున్నట్టే లేదు.