MoviesTL ఏజెంట్ రివ్యూ: ఓరినాయ‌నో ఈ 1, 1.5 రేటింగులు ఏందిరా...

TL ఏజెంట్ రివ్యూ: ఓరినాయ‌నో ఈ 1, 1.5 రేటింగులు ఏందిరా బాబు..!

ప‌రిచ‌యం:
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏజెంట్. ఏకే ఎంటర్టైర్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ ముమ్ముట్టి మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. హిప్ హాప్ త‌మీజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. వ‌క్కంతం వంశీ స్టోరీ అందించ‌గా.. అఖిల్ కెరీర్‌లోనే రు. 80 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. మ‌రి ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో TL స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ :
రా ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమాలో రా ఆఫీసర్ మమ్ముట్టి ఓ మాఫియా ముఠాని పట్టుకోవడంలో విఫ‌ల‌మ‌వుతాడు. అప్పుడు వాళ్ల‌ను ప‌ట్టుకునేందుకు కాస్త సిల్లీ యాట్యిట్యూడ్ ఉన్న అఖిల్ బెట‌ర్ అని… అత‌డే అలాంటి పెద్ద క్రిమినల్స్‌ను ప‌ట్టుకుంటాడ‌ని భావించి ఆ ఆప‌రేష‌న్ అత‌డికి అప్ప‌గిస్తారు. దీంతో అఖిల్ త‌న ట్రిక్కుల‌తో వారిని ఎలా ప‌ట్టుకున్నాడు అన్న‌దే ఈ సినిమా క‌థాంశం.

విశ్లేష‌ణ :
ఏజెంట్ కోర్ పాయింట్ ఇటీవల వ‌చ్చిన బాలీవుడ్ మూవీ పఠాన్‌కు కొంచెం ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు ఉంటుంది. రెండు సినిమాల్లో మాజీ రా ఏజెంట్లు భార‌త‌దేశానికి వ్య‌తిరేకంగా అల్ల‌క‌ల్లోలం చేసేందుకు ఇంట‌ర్నేష‌న‌ల్ మాఫియాతో చేతులు క‌లుపుతారు. వారి మార్పున‌కు మూల‌కార‌ణం కూడా రెండు సినిమాల్లో ఒక్క‌టిగానే ఉంటుంది. సినిమాకు పెట్టిన బ‌డ్జెట్‌తో పోలిస్తే క‌థ‌, క‌థ‌నాలు పూర్తి బ‌ల‌హీనంగా ఉండి తేలిపోయాయి.

అస‌లు ఎడిటింగ్ ఎంత చెత్త‌గా ఘోరంగా ఉందంటే చెప్ప‌లేం. ఈ సినిమాలో పాట‌ల ప్లేస్‌మెంట్ ఇటీవ‌ల వ‌చ్చిన చిన్న సినిమాల్లో కూడా లేనంత చెత్త‌గా ఉంది. అఖిల్ డ్యూయ‌ల్ షేడ్‌లో సినిమాను త‌న భుజ‌స్కంధాల మీద వేసుకుని న‌డిపించేందుకు ట్రై చేసినా ఉప‌యోగం లేకుండా పోయింది. అస‌లు క‌థ‌లో ద‌మ్ములేన‌ప్పుడు ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా సినిమాను ఎవ్వ‌రూ ఒడ్డు ఎక్కించ‌లేరు.

రా చీఫ్‌గా మమ్ముట్టి నటన బాగుంది. మాజీ మోడల్ డినో మోరియా మాఫియా డాన్‌గా ఏమాత్రం సరిపోని వ్యక్తి. హీరోయిన్ పాత్ర‌కు స‌రైన ప్రాధాన్య‌మే లేదు. పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. పాట‌లు కూడా బాగోలేదు. ఇక హీరోతో… హీరోయిన్ సాక్షి వైద్య‌కు వ‌చ్చే ల‌వ్ ట్రాక్ పెద్ద బోరింగ్‌. సురేంద‌ర్‌రెడ్డి అతి మామూలు క‌థ‌కు భారీ యాక్ష‌న్ హంగులు జోడించి క‌థ‌, క‌థ‌నాల‌ను గాలికి వ‌దిలేశాడు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఒక్క‌టే ఈ సినిమాకు ప్ల‌స్‌గా క‌నిపిస్తోంది.

సినిమాలో అఖిల్ వన్ మ్యాన్ షో, యాక్షన్ సీక్వెన్స్ లు సూప‌ర్బ్‌. ఇక హీరో, హీరోయిన్ల రొటీన్‌, బోరింగ్ ల‌వ్‌స్టోరీ, పాట‌లు, నేప‌థ్య సంగీతం ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. క‌థ ప‌ర‌మ రొటీన్‌.. ఇక సాగ‌దీత స‌న్నివేశాలు.. క్లైమాక్స్ ఘోరంగా ఉండ‌డం.. వ‌ర్క‌వుట్ కానీ కామెడీ ఇలా సినిమా అంతా క‌నీసం కొన్ని చోట్ల అయినా బాగుంద‌ని చెప్ప‌డానికి వీలులేకుండా ఉంది.

ప్ల‌స్ పాయింట్ల విష‌యానికి వ‌స్తే అఖిల్ యాక్టింగ్, ముమ్ముట్టి పాత్ర‌, యాక్షన్ సన్నివేశాలు, లెక్క‌కు మిక్కిలిగా పెట్టిన ఖ‌ర్చు ఉంది. ఇక మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే బోల్డెన్ని ఉన్నాయి. లాజిక్ లేని స్టోరీ –
సాంగ్స్ – బిజిఎం – రొటీన్ స్టోరీ – ప‌ర‌మ చెత్త డైరెక్ష‌న్ – పాట‌లు – సిల్లీ క్లైమాక్స్ ఇలా చాలానే ఉన్నాయి.

ఫైన‌ల్‌గా…
ఏజెంట్ అనేది ఓ పూర్ స్క్రిఫ్ట్‌తో తెర‌కెక్కిన రా స్పై థ్రిల్ల‌ర్‌. ప‌స‌లేని క‌థ‌, చెత్త ద‌ర్శ‌క‌త్వం, చెత్త సంగీతంతో నిండిపోయింది. అఖిల్ క్యారెక్టరైజేషన్ బ్యాక్‌ఫైర్, విలన్‌గా డినో మోరియా మిస్ కాస్టింగ్‌తో ఘోరంగా త‌యారైంది. ఈ సిల్లీఫిల్మ్‌ను మూడు గంట‌ల పాటు థియేట‌ర్లో కూర్చొని భ‌రించేవాడు గ్రేట్ అని చెప్పాలి.

ఫైన‌ల్ పంచ్‌: ఏజెంట్ మిస్ ఫైర్‌.. ఏ సైట్.. ఎవ‌రి నోట విన్నా ఈ సినిమాకు 1, 1.5, 1.75 మించి రేటింగ్ ఇస్తోన్న వారే లేరు..

ఏజెంట్ మూవీ TL రేటింగ్‌: 2 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news