Moviesమళ్ళీ క్షీణించిన సమంత ఆరోగ్యం.. అభిమానులు ఫుల్ టెన్షన్ టెన్షన్..ఏమైందంటే.?

మళ్ళీ క్షీణించిన సమంత ఆరోగ్యం.. అభిమానులు ఫుల్ టెన్షన్ టెన్షన్..ఏమైందంటే.?

ఎస్ .. గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఇదే న్యూస్ మళ్లీ వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంతకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే మయోసైటీస్ అనే వ్యాధి నుంచి కోలుకున్న సమంత మళ్ళీ ఇలా ఆక్సిజన్ పెట్టుకొని కనిపించడం అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది .

అయితే సమంత అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటూ క్లారిటీ వచ్చేసింది . ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న సమంత ఆక్సిజన్ పెట్టుకున్న ఫోటో గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అసలు ఇది ఏంటి ..?అని అనుకుంటున్నారా . ఈ మాస్క్ హైపర్బేరిక్ థెరపీ కోసమంట. ఈ హైపర్బేరిక్ థెరపీ వల్ల కండరాల వాపు.. ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుందట.

పాడైన కండరాలను కూడా సరిచేస్తుందట . మయోసైటిస్ సోకిన తర్వాత సమంత రెగ్యులర్ గా ఈ హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. దీంతో పూర్తి మ్యాటర్ తెలుసుకున్నాక సమంత ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు . కానీ మొదటి ఫోటో చూడగానే సమంతకు ఏమైపోయిందో అంటూ అభిమానులు టెన్షన్ టెన్షన్ పడిపోయారు. మళ్ళీ మయోసైటీస్ ఎక్కువైందా? తిరగమల్లిందా ..? సమంత ఆరోగ్యం పాడైపోయిందా ..? అంటూ తెగ బాధ పడిపోయారు ఫ్యాన్స్.

తీరా మేటర్ తెలుసుకున్నాక కూల్ అయ్యారు . ఏది ఏమైనా సరే సమంత ఆరోగ్యం ఇంకా పూర్తిగా బాగుపడలేదని మాత్రం క్లియర్గా అర్థం అయిపోతుంది . కాగా ఈ మధ్యకాలంలో సమంత ఆరోగ్యం పై ఎలాంటి వదంతులు వినిపిస్తున్నాయో తెలిసిందే . రీసెంట్గా నిర్మాత చిట్టిబాబు సైతం సమంత ఆరోగ్యం పై ఎలాంటి కామెంట్స్ చేశారో బాగా తెలిసిందే. ప్రజెంట్ సమంత ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news