ఈరోజు బాక్సాఫీస్ దగ్గర రెండు భారీ అంచనాలు ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెకకెక్కిన ఏజెంట్ సినిమాతో పాటు మణిరత్నం దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన పిఎస్ 1 లాంటి సినిమాకు కంటిన్యూగా వచ్చిన పిఎస్ 2 సినిమా కూడా రిలీజ్ అయింది. అఖిల్ ఏజెంట్ సినిమా తెలుగు సినిమా కావడంతో పాటు అక్కినేని నవ మన్మధుడు అఖిల్ హీరోగా నటించటం రు. 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కడం ఇటు సురేందర్ రెడ్డి లాంటి స్టైలిష్ డైరెక్టర్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
అటు మణిరత్నం పిఎస్ 1 సినిమాతో సంచలన విజయం నమోదు చేశారు. పైగా విక్రమ్ – కార్తి – జయం రవి – త్రిష – ఐశ్వర్యరాయ్ – శోభిత ధూళిపాళ్ల లాంటి కీలక నటులు నటించడంతోపాటు ఏఆర్ రెహమాన్ సంగీతం, తమిళ ప్రేక్షకులకు బాగా తెలిసిన కథ కావడంతో ఆ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ఓవర్సీస్ ప్రీమియర్ టాక్ ప్రకారం ఏ సినిమా విజేతగా నిలిచింది ? ఏ సినిమా పై చేయి సాధించిందో చూద్దాం.
ఓవర్సీస్ టాక్ ప్రకారం అఖిల్ ఏజెంట్ సినిమాకు పూర్తిగా నెగటివ్ టాక్ వస్తోంది. సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకోలేదని… అసలు పరమ నాశిరకం కథ, కథనాలతో నిరాశపరిచిందనే అంటున్నారు. సురేందర్‌రెడ్డి ఖర్చు పెట్టించినా కథ, కథనాలపై పట్టులేకపోవడంతో అఖిల్‌ను నిండా ముంచేసినట్టే చెపుతున్నారు. అసలు పాటలు, నేపథ్య సంగీతం బాగోలేదని.. ఫస్టాఫ్, సెకండాఫ్ తేడా లేకుండా సినిమా బాల్చితన్నేసినట్టే చెపుతున్నారు.
ఇక పొన్నియన్ సెల్వన్ 2 సినిమాకు మాత్రం మంచి టాక్ వస్తోంది. ఇంకా చెప్పాలంటే పార్ట్ 1తో పోల్చి చూసినా కూడా పార్ట్ 2కు మంచి టాక్ వస్తోంది. ఇక ఫస్ట్ పార్ట్ స్లోగా సాగితే.. రెండో పార్ట్ అదిరిపోయిందని.. చాలా వేగంగా ఉంటుందని.. స్క్రీన్ ప్లే కూడా పార్ట్ 1 కంటే చాలా బాగుందని చెపుతున్నారు. మణిరత్నం డైరెక్షన్‌తో పాటు రవివర్మ ఆర్ట్ డైరెక్షన్ సూపర్బ్ అంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే పీఎస్ 2 వర్సెస్ ఏజెంట్ బాక్సాఫీస్ వార్‌లో పీఎస్ 2కే కంప్లీట్‌గా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.