Moviesప‌వ‌న్ కోసం త్రివిక్ర‌మ్ ఎవ‌రిని అయినా ముంచేస్తాడా… ర‌గులుతోన్న టాలీవుడ్ హీరోలు…!

ప‌వ‌న్ కోసం త్రివిక్ర‌మ్ ఎవ‌రిని అయినా ముంచేస్తాడా… ర‌గులుతోన్న టాలీవుడ్ హీరోలు…!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ను బాగా నమ్ముతారు. ఆయన ఏం చెబితే అదే చేస్తారు కూడా..! తనను మాత్రమే నమ్మే పవన్ బలహీనతను ఆసరాగా చేసుకుని తాను చెప్పినట్టుగా ఆడిస్తున్నారన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో ఎప్పటినుంచో ఉన్నాయి. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. జల్సా, అత్తారింటికి దారేది సూపర్ హిట్ అయ్యాయి అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలను త్రివిక్ర‌మ్ తెరవెనక ఉండి పూర్తిగా నడిపిస్తున్నారు.

భీమ్లా నాయక్ సినిమాను సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఆ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు మొత్తం ఇచ్చింది త్రివిక్రమ్. ప్రస్తుతం పవన్ నటిస్తున్న వినోదయసితం సినిమాకు కూడా త్రివిక్రమ్ బ్యాక్ బోన్ గా ఉన్న సంగతి తెలిసిందే. చివరకు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్న స్టార్ దర్శకులు సైతం పవన్.. త్రివిక్రమ్ మాట వింటూ ఆయన చెప్పిన సినిమాలకే డేట్లు ఇస్తుండడంతో రగిలిపోతున్నారు.

ఇక తాజాగా పవన్, సాయి ధ‌ర‌మ్ తేజ్ నటిస్తున్న సినిమాను జూలైలో రిలీజ్ చేస్తున్నట్టు డేట్ ఇచ్చేశారు. ఇదంతా త్రివిక్రమ్ కనుసనల్లోనే జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఆగస్టు 11న మహేష్ బాబుతో తాను తెరకెక్కించే సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్.. మహేష్ సినిమా ఆగస్టు 11కు రాదని తనకు తానుగానే హింట్ ఇవ్వడంతో పాటు పవన్ సినిమాను జూలై 28న రిలీజ్ చేయాలని చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు సెట్ చేసినందుకు మాటలు సమకూర్చినందుకు త్రివిక్రమ్ ఏకంగా 15 కోట్ల వరకు తీసుకున్నారని టాక్ ఉంది. అందుకే త్రివిక్రమ్ తాను డైరెక్ట్ చేసే మహేష్ సినిమాను కూడా పెద్దగా పట్టించుకోకుండా.. ఇప్పుడు పవన్ సినిమా మీదే పూర్తిగా దృష్టి పెట్టి కథ నడిపిస్తున్నాడని అంటున్నారు. అందుకే మహేష్ సినిమాను మెల్లమెల్లగా సంక్రాంతి దిశ‌గా నడిపించేస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో సంక్రాంతికి రామ్ చరణ్, ప్రభాస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇలా చాలామంది స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి.

ఇప్పుడు మహేష్ సినిమాను సంక్రాంతికి వాయిదా వేశారు. అప్పుడు అయినా రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీ లేదు. ఏదేమైనా త్రివిక్రమ్ పవన్ కోసం తన సొంత సినిమాలను సైతం సరిగా కాన్సన్ట్రేషన్ చేయడం లేదని.. దీంతో త్రివిక్రమ్ తో సినిమా అంటేనే స్టార్ హీరోలు కూడా భయపడటంతో పాటు రగిలిపోతున్నారని తెలుస్తోంది. మహేష్ సైతం ఇప్పుడు తాను త్రివిక్రమ్ సినిమా ఎందుకు ?ఒప్పుకున్నానా ? అని ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. మరి త్రివిక్రమ్ కేవలం పవన్ మీద ఇంత‌ అభిమానం చూపిస్తే.. మిగిలిన స్టార్ హీరోలు ఆయనకు దూరం అయ్యే ప్రమాదం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news