Newsవిష్ణు కొట్ట‌డానికి వెళ్లిన సార‌థి ఎవ‌రు… మ‌నోజ్‌తో అప్ప‌టి నుంచే గొడ‌వ‌లా…!

విష్ణు కొట్ట‌డానికి వెళ్లిన సార‌థి ఎవ‌రు… మ‌నోజ్‌తో అప్ప‌టి నుంచే గొడ‌వ‌లా…!

నిన్న మొన్నటి వరకు అన్యోన్యంగా ఉన్నట్టు కనిపించిన మంచు మోహన్ బాబు కుటుంబం ఒక్కసారిగా రోడ్డు ఎక్కింది. మంచు అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య ఉన్న గొడవలు ఒక్కసారిగా భ‌గ్గుమన్నాయి. విష్ణు కోపం పట్టలేక మంచు కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే సారథిని కొట్టడానికి అతని ఇంటికి వెళ్లినట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన మనోజ్.. తన అన్న చేసిన పనిని ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు విష్ణు కొట్టడానికి వెళ్లిన సారథి ఎవరు ? విష్ణు అతడిని ఎందుకు కొట్టడానికి వెళ్ళాడు అన్నదానిపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

సారథి మోహన్ బాబు కుటుంబానికి ముందు నుంచి నమ్మినబంటు. మోహన్ బాబు ఎక్కడికి వెళ్లినా సారథి ముందు ఉండి అన్ని చూసుకుంటూ వస్తున్నాడు. ఇండస్ట్రీలో కూడా సారథికి, మంచు కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇక మనోజ్ ఫిలింనగర్ దగ్గరలో ఉన్న మోహన్ బాబు ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇల్లు మోహన్ బాబు తన కూతురు లక్ష్మికి ఎప్పుడో ఇచ్చేశారు. అప్పటినుంచి ల‌క్ష్మి ఇక్కడ ఉంటుంది. మోహన్ బాబు శంషాబాద్ దగ్గరలో ఉన్న ఇంట్లోకి వెళ్లిపోయాడు. పెద్ద కొడుకు విష్ణు కూడా తండ్రితో పాటు కలిసి ఉంటున్నాడు.

ఇక లక్ష్మికి చిన్న తమ్ముడు మనోజ్ కి ముందు నుంచి అనుబంధం ఎక్కువ. అందుకే మనోజ్ ఎప్పుడు ?ఫిలింనగర్లో లక్ష్మీ ఇంట్లో ఉంటున్నాడు. అలాగే అతడు భూమా మౌనికతో ఉన్నపుడు కూడా ఈ ఇంట్లోనే ఉండేవాడు. మనోజ్ వివాహం కూడా అక్క లక్ష్మి దగ్గరుండి తన ఇంట్లోనే జరిపించింది. ఆ వివాహంలోనూ విష్ణు అంటి ముట్టనట్టుగానే కనిపించాడు. అప్పుడే మనోజ్ – భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి. అయితే మనోజ్ వివాహం అయ్యాక బయటికి వచ్చినప్పుడు సారథి ఎక్కువగా మనోజ్‌తోనే ఉంటున్నాడట‌.

ఈ విషయంలోనే విష్ణుకి మనోజ్ కి మధ్య కొంత సమాచారం లోపం ఏర్పడి.. ఈ గొడవ అంతా సారథి మీద పడి ఉంటుందని.. అందుకే విష్ణు తమ్ముడని ఏమీ అనలేక సారథి ఇంటి మీదకు వెళ్లి ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఈ లోగా మోహన్ బాబుకి విషయం తెలిసి ఇద్దరు కొడుకులు మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పాటు మనోజ్ కు ఫోన్ చేసి ముందు ఆ వీడియో డిలీట్ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news