నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా సూపర్ డూపర్ హిట్లు బాలయ్య ఖాతాలో పడ్డాయి. గత పది ఏళ్లలో బాలయ్య కెరీర్ చూస్తే అఖండకు ముందు అఖండ తర్వాత అని చెప్పుకోవాలి. అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు బాలయ్య సినిమా తొలిరోజు ఏకంగా 54 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించడం అంటే బాలయ్య క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ? తెలుస్తోంది. బాలయ్య ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసారు.
ఇక ఇప్పుడు బాలయ్య ముందున్న టార్గెట్ తన కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు హీరోగా పరిచయం చేయటం ఒక్కటే మిగిలి ఉంది. ప్రస్తుతం ఆ పనుల్లోనే బాలయ్య బిజీబిజీగా ఉంటున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని బాలయ్య కెరీర్ చూసుకోవడంతో పాటు క్రియేటివ్ కన్సల్టెంట్ గా కూడా ఉంటున్నారు. అలాగే బాలయ్య ఎంచుకునే ? కథలతో పాటు కాస్ట్యూమ్స్ లుక్స్ విషయంలో దగ్గరుండి మరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బాలయ్య చిన్నల్లుడు బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన శ్రీ భరత్. శ్రీ భరత్ కు అటు తండ్రి వైపు నుంచి.. ఇటు తల్లి వైపు నుంచి కూడా బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. శ్రీ భరత్ తండ్రివైపు తాత దివంగత ఎంవీవీఎస్ మూర్తి. ఆయన వైజాగ్ ఎంపీగా పనిచేయడంతో పాటు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక అమ్మ వైపు తాత కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు. ఆయన మచిలీపట్నం, ఏలూరు నుంచి ఐదుసార్లు లోక్ సభకు ఎంపిక అవ్వడంతో పాటు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.
తేజస్వినితో శ్రీ భరత్ కు చిన్నప్పటినుంచే పరిచయం ఉంది. భరత్ అమెరికాలో చదువుతున్నప్పుడు భరత్ పెద్దమ్మకు రెండు కుటుంబాల తరఫున బంధుత్వం ఉండడంతో ఆమె బాధ్యత తీసుకుని రెండు కుటుంబాలతో మాట్లాడి పెళ్లి సెట్ చేశారట. భరత్ తల్లి, ఇటు బాలయ్య భార్య వసుంధర, భరత్ వాళ్ళ పెద్దమ్మ చిన్నప్పటినుంచి హైదరాబాదులో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారట.
అలా వీరి మధ్య ఎప్పటినుంచో పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బ్రాహ్మణి, తేజస్వినిని కూడా భరత్ చిన్నప్పటి నుంచి కలుసుకునే వారని.. తేజస్విని గుణగణాలు అంటే భరత్ కు ముందు నుంచే ఇష్టం. అందుకే ఈ ఇద్దరికి పెళ్లి అనగానే రెండు కుటుంబాలు వెంటనే ఓకే చెప్పేసాయి. అలా భరత్ – తేజస్విని పెళ్లి సెట్ అయింది.