టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ సినిమా ఉగాది కానుకగా రిలీజ్ అవ్వగా తొలి రోజు అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. అసలు విశ్వక్సేన్ రేంజ్ కు ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను పోల్చి చూస్తే సంబంధమే లేదు. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 8.88 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది.
విశ్వక్సేన్ కెరీర్ లోనే ఇది మొదటి రోజు అత్యధిక వసూళ్లు కావటం విశేషం. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తున్న టాలీవుడ్ వర్గాలకే దిమ్మతిరిగిపోయినంత పని అయింది. మరో బ్యానర్‌తో కలిపి విశ్వక్సేన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు విశ్వక్సేన్ దర్శకత్వం వహించారు. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్, అజయ్, అక్షర గౌడ, రావు రమేష్, రోహిణి కీలకపాత్రలో నటించారు.
ఇక నైజాంలో అయితే ఈ సినిమాకు తొలి రోజు ఏకంగా 2.7 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా.. డిస్ట్రిబ్యూటర్ షేర్ 1.50 కోట్లు వచ్చింది. ఇది నిజంగా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అలాగే యుఎస్ లో కూడా కేవలం ప్రీమియర్లతోనే 1.50 లక్షల డాలర్ల వసూళ్లు రాబట్టింది.
ఈ జోరు చూస్తుంటే ఈ వీకెండ్ లో ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుందని అంటున్నారు. ఏదేమైనా విశ్వక్సేన్ వరుసగా మరో అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మనోడి క్రేజ్ టాలీవుడ్ లో ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది అనటంలో సందేహం లేదు.