Movies'బోరింగ్ పాప' ఫ్యామిలీపై ఇప్ప‌టికీ స‌స్పెన్సే.. ఆ న‌టుడికి ఆమెపై అంత...

‘బోరింగ్ పాప’ ఫ్యామిలీపై ఇప్ప‌టికీ స‌స్పెన్సే.. ఆ న‌టుడికి ఆమెపై అంత ప్రేమా…!

జ‌య‌ల‌లిత అన‌గానే సాధార‌ణంగా.. త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత గురించే అనుకుంటారు. అయితే.. చిత్రంగా.. ఆ జ‌య‌ల‌లిత‌కు.. హైద‌రాబాద్‌లో సెటిల్ అయిన‌.. బోరింగ్ పాప జ‌య‌ల‌లిత‌కు పెద్ద‌గా తేడా లేద‌ని అంటారు. న‌ట‌న ప‌రంగా ఆ జ‌య‌ల‌లిత‌.. హీరోయిన్‌గా న‌టిస్తే.. బోరింగ్ పాప‌.. మాత్రం క్యారెక్ట‌ర్ + వ్యాంపు పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైంది. స‌రే.. ఆ జ‌య‌ల‌లిత రాజ‌కీయంగా అమ్మ‌గా ఓ రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించారు.

ఈ జ‌య‌ల‌లిత మాత్రం కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమితం అయ్యారు. అయితే.. ఇద్ద‌రి జ‌య‌ల‌లిత‌ల మ‌ధ్య ఉన్న సారూప్య‌త‌ల విష‌యానికి వ‌స్తే.. ఆ జ‌య‌కు.. పెళ్లికాలేదనే టాక్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ జ‌య ల‌లిత‌కు కూడా వివాహం కాలేదు. కానీ, అయిందని.. ఓ సంద‌ర్భంగా బోరింగ్ పాపే చెప్పింది. ఒక ద‌ర్శ‌కుడిని ఆమె ర‌హ‌స్యంగా వివాహం చేసుకుంది. ఇద్ద‌రూ క‌లిసి సినిమాలు కూడా తీశారు. అయితే.. అవి ఫుల్లుగా విఫ‌ల‌మ‌య్యాయి.

దీంతో ఇద్ద‌రి మ‌ధ్య చెడిపోయి.. వివాదాలకు దారితీసి.. చివ‌ర‌కు బోరింగ్ పాప కూడ‌బెట్టుకున్న మొత్తాన్ని కూడా.. స‌ద‌రు ద‌ర్శ‌కుడు కొల్ల గొట్టాడ‌ని.. త‌న‌కు క‌నీసం ప‌ది రూపాయ‌లు కూడా మిగ‌ల్చ‌కుండా చేశాడ‌ని.. ఆమె అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే.. తెలుగు ఇండ‌స్ట్రీలో చ‌ల‌ప‌తిరావు త‌న‌ను అన్ని విధాలా ఆదుకున్నార‌ని బోరింగ్ పాప చెప్పడం గ‌మ‌నార్హం. ఆర్థికంగా ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు.. ఆదుకున్నార‌ని.. హైద‌రాబాద్‌లో ఇల్లు కూడా కొనిచ్చార‌ని.. ఆమె వివ‌రించారు.

అప్ప‌ట్లో జ‌య‌ల‌లిత‌పై చ‌ల‌ప‌తిరావుకు ఎంతో ప్రేమ ఉండేద‌ని ఇండ‌స్ట్రీ వాళ్లు చెప్పుకునే వారు. వంశీ సినిమాల్లో న‌టించి.. మంచి పేరు తెచ్చుకున్న బోరింగ్ పాప జ‌య‌ల‌లిత‌.. ఏప్రిల్ ఒక‌టి విడుద‌ల‌, త‌దిత‌ర సినిమాల్లో న‌టించి మాస్ యువ‌త‌కు బాగా చేరువ‌య్యారు. అయితే.. ఆమె కుటుంబంపై మాత్రం ఇప్పటికీ స‌స్పెన్స్ కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news