Moviesప్రెగ్నెన్సీని దాచి.. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న సావిత్రి.....

ప్రెగ్నెన్సీని దాచి.. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న సావిత్రి.. అంత పెద్ద తప్పు ఎందుకు చేసిందంటే..!!

మ‌హాన‌టి సావిత్రి.. సినీ ఫీల్డ్‌లో దూసుకుపోతున్న రోజుల్లోనే ర‌హ‌స్యంగా వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనికి ఆమె కుటుంబ కార‌ణాలు ఉన్నాయి. సంర‌క్ష‌ణ చేసిన బాబాయి కోప్ప‌డ‌తాడ‌నో.. లేక సినిమా ఆఫర్లు మంద‌గిస్తాయ‌నో.. సావిత్రి భావించారు. దీంతో ఆమె.. అప్పుడప్పుడే త‌న‌ను తాను తీర్చిదిద్దుకుంటున్న‌ ద‌ర్శ‌కుడు జెమినీ గ‌ణేశ‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. విష‌యం మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు.

దీంతో చాన్నాళ్ల‌పాటు సావిత్రి వివాహం విష‌యం ఎవ‌రికీ తెలియ‌కుండానే పోయింది. అయితే.. చాన్నాళ్ల‌కు .. సావిత్రి ఒక విష‌యాన్ని మాత్రం దాచ‌కుండా ఉంచ‌లేక పోయారు. అదే ప్రెగ్నెన్సీ. వాస్త‌వానికి.. ప్రెగ్నెన్సీ రాకుండా చేసేందుకు.. మందులు తీసుకున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. దీంతో అనారోగ్యం పాల‌య్యార‌ని ఒక‌ప్పుడు వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. అయితే.. త‌ర్వాత కాలంలో సావిత్రి.. భ‌ర్త ఒత్తిడి మేర‌కు ప్రెగ్నెంట్ అయ్యారు.

అయితే.. అప్పటికే కొన్ని సినిమాల్లో న‌టిస్తున్న కార‌ణంగా.. సావిత్రి ఈ ప్రెగ్నెంట్ విష‌యాన్ని దాచి పెట్టారు. అయితే.. ఇలా దాచిపెట్టినందుకు ప‌నిష్మెంట్‌గా అప్ప‌టి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి రెండు సినిమాల నుంచి సావిత్రిని తొల‌గించి.. వేరే వారిని పెట్టుకున్నార‌ట‌. ఈ విష‌యం చాలా రోజుల‌కు గాని బ‌య‌ట‌కు రాలేదు. నాటి ఈ సంఘ‌ట‌న‌ను గుమ్మ‌డి రాసుకున్న పుస్త‌కంలో పేర్కొన్నారు.

కేవీ రెడ్డిగారికి మ‌హా భ‌యం. షూటింగు స‌మ‌యంలో ఏదైనా జ‌రిగితే.. సంస్థ‌కు బ్యాడ్‌నేమ్ వ‌స్తుంద‌ని..రెప్యుటేష‌న్ పూర్తిగా చెడిపోతుంద‌ని అంటారు. అందుకే.. యూనిట్ ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య ఉన్నా.. ఆయ‌నకు చెప్పాల్సిందే. సావిత్రి ఈ ఫార్ములాను పాటించ‌లేదు. దీంతో రెండు సినిమాలలో త‌మిళ‌నాడుకు చెందిన వ‌ర్థ‌మాన న‌టిని తీసుకున్నారు అని గుమ్మ‌డి వివ‌రించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news