తోడికోడళ్లు పాత సినిమాలో బాగా సూపర్ హిట్ కొట్టిన పాట కారులో షికారుకెళ్లే.. పాలబుగ్గల పసిడీ దానా.. అనే పాట ఉంటుంది. ఇది.. ఇప్పటికీ.. పాతతరం ప్రేక్షకుల నోళ్ల నుంచి వినిపిస్తూనే ఉంటుంది. అయితే.. ఈ పాట చిత్రీకరణలో రెండు మూడు గమ్మత్తులు చోటు చేసుకున్నాయి. పాటను రాసింది.. శ్రీశ్రీ అనుకున్నారు అందరూ. కానీ, రాసింది ఆత్రేయ. నిజానికి ఆత్రేయ అంటే.. శాడ్ సాంగ్స్‌కు పేరు. కానీ, ఈ పాట అంతా కూడా అభ్యదయం దిశగా సాగింది. ఇదొక విశేషం.
ఇక, చిత్రీకరణ విషయానికి వస్తే.. పాటలో చరణం చరణానికి తేడా ఉంటుంది. ఒక్కొక్క అంశంలోనూ.. పేదలను.. కార్మికులను హీరోలుగా చూపిస్తూ.. పెద్దలు అనుభవిస్తున్న దర్జాకు వారే కారణమని పేర్కొనే థీమ్ సాంగ్ ఇది. దీనిని అలానే చిత్రీకరించాలనేది ఆత్రేయ ఉద్దేశం. అయితే.. సావిత్రి ఇందులో హీరోయిన్. కానీ, ఆమె మధ్యతరగతి మహిళగా నటించారు. పైగా అక్కినేని సరసన భార్యగా నటించారు.
ఎలాంటి డ్యుయెట్స్ లేవు. దీంతో ఈ పాటలో అయినా.. అలా చూపించాలని ప్రయత్నించారు. కానీ.. సావిత్రి అందుకు ఒప్పుకోలేదు. అలా బాగుండదేమో.. రచయిత గారి ఆత్మ దెబ్బతింటుంది..! అని ఆమె అన్న మాటకు అక్కినేని జై కొట్టారు. నిజమే.. బ్యాక్ గ్రౌండ్‌ను ఖాళీగా వదిలేస్తే.. ప్రజలకు బాగా చేరుతుందని అక్కినేని కూడా అన్నారు.
దీంతో పాట మొత్తంలో ఎక్కడా కూడా.. ఎలాంటి చిత్రీకరణ (అంటే.. చరణానికి తగిన విధంగా) లేకుండానే సోలో సాంగ్‌ను రూపొందించారు. ఇది సూపర్ హిట్ కొట్టింది. ఈ క్రెడిట్ అంతా సావిత్రిదేనని.. తాను రాశాను కానీ, ఇంత హిట్ కావడం వెనుక సావిత్రి ఐడియా ఉందని.. ఆత్రేయ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.