సాధారణంగా మనిషి అన్నాక కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. ప్రతి మనిషికి కొన్ని మూఢనమ్మకాలు .. కొన్ని పాటింపులు ..కొన్ని ఫాలోయింగ్ లు ఉంటాయి . అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ కూడా అలాంటివి ఫాలో అవుతూ ఉంటారా..? అంటే అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు.. అందులో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .
మనకు తెలిసిందే ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ..ఆ తర్వాత వెంటనే రాజమౌళి డైరెక్షన్లో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు కన్ఫామ్ గా హిట్ అవుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబుకు సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది . కాగా మొదటి నుంచి సెంటిమెంట్స్ ఎక్కువ ఫాలో అవ్వని మహేష్ బాబు కి తన లైఫ్ లో మాత్రం అక్టోబర్ నెల అంటే భయపడిపోతూ ఉంటారట .
ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి అక్టోబర్ నెల అంటే ఆయనకి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంటుందన్న నమ్మకం ఉంది అంటూ తెలుస్తుంది. అక్టోబర్ నెల అచ్చు రాలేదని .. ఆ నెలలో రిలీజ్ అయిన సినిమాల పరంగా ఫ్యామిలీ ఇష్యూస్ పరంగా ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడట. ఇప్పటివరకు మహేష్ బాబు కెరియర్ లో అక్టోబర్లో మొదలుపెట్టిన పని ..రిలీజ్ అయిన సినిమాలు డిజాస్టర్ గానే మారాయి. అంతేకాదు అక్టోబర్ కచ్చితంగా ఆయనకి చెడు వార్తల ఎక్కువ వినిపిస్తూ ఉంటాయట. ఈ క్రమంలో నే అక్టోబర్ నెలలో షూటింగ్ లు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉంటాడని .. ఆయన సినిమాలు ఎట్టి పరిస్థితులను అక్టోబర్ లో రిలీజ్ అవ్వకుండా చూసుకుంటాడని తెలుస్తుంది. అందుకే ఆయన అక్టోబర్ నుంచి తప్పించుకోవడానికి ఫారిన్ కంట్రీస్ కి టూర్లకి వెళ్ళిపోతూ ఉంటారట . అలా అక్టోబర్ నెల అంటే మహేష్ బాబుకి విపరీతమైన భయం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!