Movies"నా ఫేక్ కి అంత సీన్ లేదులేండి".. ఎవ్వరు ఊహించని కామెంట్స్...

“నా ఫేక్ కి అంత సీన్ లేదులేండి”.. ఎవ్వరు ఊహించని కామెంట్స్ చేసి షాక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా నందమూరి కుటుంబ సభ్యులు అంటే జనాలకు అదో తెలియని గౌరవం . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేశారు నందమూరి తారక రామారావు గారు . ఇప్పటికీ నందమూరి అనే పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు తారక రామారావు గారే. ప్రజెంట్ ఆయన వారసులుగా ఇండస్ట్రీలో నందమూరి హీరోలు రాజ్యమేలేస్తున్నారు .

అభిమానుల కోసం డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను చూస్ చేసుకుని.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు . అదే లిస్టులోకి వస్తాడు నందమూరి తారకరామా రావు గారి మనవడు కళ్యాణ్ రామ్ . రీసెంట్ గానే బింబిసారా, అమిగోస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్.. బింబిసారా 2 ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.

ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న నందమూరి కళ్యాణ్ రామ్ కి తాతకు తగ్గ మనవడు మీరు అంటూ ఓ కాంప్లిమెంట్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన రెస్పాండ్ అవుతూ ..”దయచేసి అలా అనకండి,,ఆయనతో నన్ను పోల్చకండి. ఆయన లాంటి వాళ్లు ఎవరు ఉండరు. ఆయన ఒక్కడే ఉంటారు . ఆయన స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు . ఆయన స్థాయికి నేను ఎదగలేను . ఆయన ప్లేస్ కి నేను రీచ్ అవ్వలేను.. “అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనేది నందమూరి హీరోల దగ్గర నుండే నేర్చుకోవాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news