సినీ రంగంలో కొన్ని విశేషాల గురించి చెప్పాలనుకున్నప్పుడు.. నిశితంగా గమనిస్తే.. బ్లాక్ అండ్ వైట్ రోజు ల్లో ఉన్న హీరోయిన్లకు, కలర్ సినిమాలు వచ్చిన తర్వాత.. వెండితెరపై అభినయం చేసిన.. హీరోయిన్లకు మధ్య తేడాను చెప్పాల్సి ఉంటుంది. అప్పట్లో.. హీరోయిన్లు.. స్కిన్ షో కన్నా.. ముఖాభినయానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. రౌద్ర, శృంగార పాత్రలను కూడా అలవోకగా ముఖ కవళికలతోనే పలికించేవారు.
ఇక, ఎక్కడా కూడా.. హీరోయిన్ – హీరోలను వాటేసుకోవడం అన్నది ఉండేది కాదు. ఇది అందరికీ తెలిసిందే. తర్వాత.. ఈస్ట్‌మన్ కలర్ వచ్చిన తర్వాత.. కొంత వరకు స్కిన్ షో మొదలైంది. అది కూడా లిమిటెడ్‌గానే ఉండేది. పైగా.. ఎక్కువగా స్కిన్ షో ఉంటే.. దర్శకులపై బ్యాడ్ ముద్ర పడేది. సినిమాలో కథలేదు.. అందుకే స్కిన్‌షో చేశారనే వాదన బలంగా వినిపించేది. దీనిని అప్పటి దర్శకులు కొంత నెగిటివ్‌గా తీసుకునేవారు.
ఇక, హీరోయిన్ల మధ్య ప్రధాన తేడా ,చూస్తే.. బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల్లో ఉన్న హీరోయిన్లు.. మెజారి టీగా.. ఒక విజన్‌తో పనిచేసేవారు. భవిష్యత్తు కోసం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన అంజలీదేవి, భానుమతి, విజయనిర్మల, కన్నాంబ, సావిత్రి (ఈమె కూడా నిర్మాత, దర్శకురాలిగా పనిచేశారు).. ఇలా చాలా మంది ఫ్యూచర్‌పై దృష్టి పెట్టి.. సినీ నిర్మాణానికి మొగ్గు చూపారు.
ఇక, ఈస్ట్ మన్ కలర్ సినిమాలు వచ్చేసరికి.. మాత్రం హీరోయిన్లు ఫ్యూచర్‌పై దృష్టి పెట్టలేక పోయారు. దీనికి కారణాలు ఏవైనా కూడా భానుప్రియ, రాధ, శ్రీదేవి, జయప్రద వంటివారు.. దర్శకత్వం, నిర్మాణ సంస్థల వైపు అసలు మొగ్గు చూపలేక పోయారు. ఇది ఒకరకంగా.. పాతతరం హీరోయిన్లను.. కొత్తతరం హీరోయిన్లను చాలా వేరు చేసిందనే చెప్పాలి.