MoviesManchu manoj మనోజ్ పెళ్లికి స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరో...

Manchu manoj మనోజ్ పెళ్లికి స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరో మొదటి భార్య..షాక్ అవుతున్న సినీ ప్రముఖులు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు అందరూ .. విడాకులు తీసుకుని సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ ప్రముఖులు విడాకులు తీసుకొని రెండో పెళ్లి కూడా చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాగ రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్. టాలీవుడ్ లో హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

కాగా 2019 వరకు బాగానే సాగిన వాళ్ల సంసారంలో కొన్ని మనస్పర్ధలు కారణంగా 2019లో విడాకులు తీసుకొని చట్టబద్ధంగా విడిపోయారు . ఈ క్రమంలోనే అప్పటినుంచి సింగిల్గా ఉన్న మంచు మనోజ్ రీసెంట్ గానే దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళకి సంబంధించిన పెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గత కొన్ని రోజుల నుంచి మౌనిక రెడ్డి మనోజ్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హంగామా చేస్తుందో తెలిసిందే .

అయితే వీళ్ల పెళ్ళికి మంచు మనోజ్ భార్య ప్రణతి రెడ్డి హాజరైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న రాత్రి లక్ష్మీ మంచు స్వగృహంలో గ్రాండ్గా జరిగిన వీళ్ళ పెళ్లికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి అంటూ సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు చెప్పుకుంటున్నారు . అతి తక్కువ మంది సినిమా సెలబ్రెటీస్ అటెండ్ అయిన ఈ ఈవెంట్లో ఆమెను చూసి అక్కడ జనాలు షాక్ అయిపోయారట . ఈ క్రమంలోనే భర్త రెండో పెళ్లికి భార్య చీఫ్ గెస్ట్ గా రావడం ఏంటి అంటూ జనాలు షాక్ అవుతున్నారు. అంతేకాదు విచ్చలవిడిగా కొందరు ప్రణతి రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోని మరోసారి మంచు మనోజ్ – ప్రణతి రెడ్డిల పెళ్లి ఫిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news