సినీ రంగంలో మెరుపులు మెరిపించారు. వారు లేకపోతే.. సినిమాలే లేవనేంతగా ఎదిగిపోయారు. అంతే కాదు.. వారంటే చాలు సినిమాలు వంద రోజులేం ఖర్మ.. సంవత్సరాలే.. అనుకునేంతగా ఎదిగిపోయారు. వారే.. సావిత్రి, కాంచనమాల, కృష్ణకుమారి, షావుకారు జానకి, భానుమతి, అంజలీదేవి, శ్రీరంజని వంటి హేమా హేమీలు. అయితే.. సినిమాల్లో హిట్ కొట్టారు కానీ.. నిజ జీవితాల్లో మాత్రం వారు వైఫల్యం చెందారంటే ఆశ్చర్యం వేస్తుంది.
వీరిలో సావిత్రి గురించే అందరికీ తెలుసు. ఆమె మద్యానికి బానిస అయిందని.. అందుకు ఇల్లు ఒళ్లు కూడా గుల్ల చేసుకుని..చివరకు ఇబ్బందులు పడ్డారని అందరూ అనుకుంటారు. అయితే.. సావత్రి ఒక్కరే కాదు.. పైన చెప్పుకొన్నవారిలో చాలా మంది వారి వారి వ్యక్తిగత వ్యసనాల కారణంగా.. జీవితంలో విఫలమయ్యారనే చెప్పాలి.
కాంచనమాలను తీసుకుంటే.. మద్యానికి బానిస కాలేదు. కానీ, పేకాట ఆడేవారు. అది కూడా అర్ధరాత్రి వరకు క్లబ్బులకు వెళ్లి.. ఆడి ఉన్నది మొత్తం ఊడ్చి పెట్టేశారు. షావుకారు జానకి, కృష్ణకుమారి..ఇద్దరూ కూడా అక్కాచెల్లెళ్లు అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే.. వీరికి ఎలాంటి వ్యసనాలు లేవు. కానీ, దైవ భక్తి అత్యధికం. ఇది కూడా మితిమీరిపోయింది. దీంతో పేద సాదలకు అతి పంపకాలు చేశారు.
తనకు వచ్చిన అవార్డును అమ్మేసి.. చెన్నైలో ఒక సత్రం నిర్మించిన కృష్ణకుమారి.. గురించి చాలా మందికి తెలియదు. తాను సంపాయించిన దానిలో సగం సొమ్మును.. పేదలకు దానం చేసిన షావుకారు గురించి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఇక, శ్రీరంజని.. తీసుకునేదే తక్కువ. అది కూడా సినిమాలో బాధిత వర్గంగా ఉన్నవారికి ఇచ్చేసేవారు. ఒకానొక సందర్భంలో కారు కూడా అమ్మేసే పరిస్తితి వచ్చింది.ఉన్న ఇంటిని అప్పుల వారికి ఇచ్చేశారు. చివరకు మదర్ థెరిసా ఆశ్రమంలో చేరి.. అక్కడే అశువులు బాసారని అంటారు.
ఇక, భానుమతి, అంజలీదేవి.. బాగానే సంపాయించుకున్నారు.కానీ, భానుమతి తన ఆస్తి మొత్తాన్ని కుమారుడు రామకృష్ణకు రాసేస్తే.. కుమారుడితో విడాకులు తీసుకున్న కోడలు మొత్తం ఆస్తిని తీసుకుని.. భానుమతికి కట్టుబట్టలే మిగిల్చింది. అంజలీదేవి.. తన ఆస్తి మొత్తాన్ని రెండుగా చేసి.. పుట్టపర్తి, షిర్డీ సాయిలకు ఇచ్చేసి, చివరి దశలో కుమార్తె ఇంట్లో గడిపారు. ఇదీ.. సంగతి..!