గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో నరేష్ – పవిత్రలను కలిపింది ఆ పెద్దాయనే అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. నరేష్ పవిత్రలను కలిపింది ఆయనే అంటూ సినీ ఇండస్ట్రీలో క్రేజీ టాక్ వైరల్ అవుతుంది . సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నరేష్-పవిత్రలను ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారట.
యస్.. ఇదంతా తన సినిమా స్ట్రాటజీ ప్రకారమే చేశాడు అంటూ టాక్ వినిపిస్తుంది . మనకు తెలిసిందే డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకుని సినిమాలు నిర్మించడంలో ఆయన ధిట్ట. అదేవిధంగా ఇప్పుడు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు కూడా . రీసెంట్గా డర్టీ హరి అనే సినిమాను తీసి ఎలాంటి క్రేజీ కామెంట్స్ ను అందుకున్నాడు అందరికీ తెలిసిందే.
కాగా త్వరలోనే “సెకండ్ ఇన్నింగ్స్” అనే సినిమాను చేయబోతున్నాడట రాజు . ఈ క్రమంలోనే పవిత్ర – నరేష్ ను ఆ సినిమా లో లీడ్ గా చూపించబోతున్నారట. పెళ్లి చేసుకున్నాక డివర్స్ అయితే..మళ్లీ ప్రేమ పుడితే..ఇంట్లో ఎదురైయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చెప్పే విధంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే నరేష్-పవిత్రల ప్రేమను వాడుకుంటున్నాడు రాజు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.