Moviesఅస‌లు మెగా ఫ్యామిలీలో ఎందుకీ విడాకులు... కాపురాలు అందుకే కూలుతున్నాయా...!

అస‌లు మెగా ఫ్యామిలీలో ఎందుకీ విడాకులు… కాపురాలు అందుకే కూలుతున్నాయా…!

టాలీవుడ్లో మెగా ఫ్యామిలీని ఏదో శాపం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ కుటుంబంలో వివాహాలు నిలవడం లేదు. చిరు ఇంట్లో సమస్య తెలిసిందే. చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. పవన్ పెద్ద స్టార్ హీరో కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా చాలా రోజులపాటు భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది. వాస్తవంగా వాళ్ళది చెన్నై.. అయితే సుస్మిత గత 15 సంవత్సరాలుగా హైదరాబాదులోనే ఉంటుంది.

వారిద్దరి మధ్య సరైన సంబంధాలు లేవని.. ఇరువైపులా పెద్దలు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రచారం నడుస్తోంది. ఇక రెండో కుమార్తె శ్రీజ విషయానికి వస్తే ముందుగా శిరీష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది ఈ పెళ్లి ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు.. ఓ పాప పుట్టాక చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్‌ని రెండో భర్తగా స్వీకరించింది. ఈ దంపతులకు కూడా ఒక పాప పుట్టాక మళ్ళీ మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. త్వరలోనే వీరికి విడాకులు కూడా మంజూరు కానున్నాయని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఇది నాగబాబు కుటుంబానికి కూడా పాకేసింది. నాగబాబు కుమార్తె నిహారిక, అల్లుడు జొన్నలగడ్డ చైతన్య మధ్య ఏదో ? జరుగుతుందన్న గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇది గత కొంతకాలం నుంచి వినిపిస్తున్నదే. ఇటీవల నిహారిక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమె నుంచి ఎలాంటి హడావుడి లేదు. పైగా మెగా ఫ్యామిలీ ఫోటోల్లో చైతన్య కూడా ఎక్కడ కనపడటం లేదు. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ ఒకరి సోషల్ మీడియా అకౌంట్లు మరొకరు ఫాలో కావటం లేదట. చైతన్య తన అకౌంట్ నుంచి పాత ఫోటోలు అన్నీ డిలీట్ చేసేసారని తెలుస్తోంది.

వీరు నిజంగా విడిపోయారా లేదా ? అన్నది క్లారిటీ రావటానికి కొంత టైం పట్టవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ పుకార్లు మాత్రం ఆగటం లేదు. వాస్తవంగా చూస్తే మెగా ఫ్యామిలీలో ఆడపిల్లల వివాహాలు ఎందుకు కలిసి రావటం లేదు అన్న ప్రశ్నకు ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు నుంచి మెగా బ్రదర్స్ తమ ఆడపిల్లలను చాలా గారాబంగా పెంచుకున్నారు. చిన్నప్పటినుంచి అపురూపంగా చూసుకున్నారు. మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చేశారు. ఎక్కడ కంట్రోల్ అన్నది లేదు పైగా వారు ఉంటుంది గ్లామర్ ప్రపంచం. కనీసం కొన్ని కొన్ని విషయాలలో అయినా భర్త మాటలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత భార్యలపై ఉంటుంది.

కానీ ఇక్కడ మేము మెగా ఫ్యామిలీ ఆడపడుచులం అన్న ధోరణి వారిలో ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో టాకు ఉంది. ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు.. పెళ్లి చేసుకుంటే కనీసం పట్టుమని మూడు నాలుగేళ్లు కూడా కలిసి ఉండే పరిస్థితి లేదు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి అయిన మూడు నాలుగు ఏళ్లకే భర్తతో మ‌న‌స్ప‌ర్ద‌లు రావడంతో దూరం జరిగింది. ఇక రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో కనీసం నాలుగు సంవత్సరాలు కూడా కాపురం చేయలేదు.

ఇప్పుడు నిహారిక కూడా పెళ్లి అయ్యాక మూడేళ్లు కూడా భర్తతో కలిసి ఉండలేని పరిస్థితి. మితిమీరిన స్వేచ్ఛ.. తాము చెప్పిందే జరగాలన్న పంతం.. భర్తకు విలువ ఇవ్వకపోవడం.. లాంటి కారణాలే వారి కాపురాలు కూలిపోవటానికి ప్రధానంగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో ఎప్పటినుంచో నడుస్తోంది. ఈ విషయంలో వారు తగ్గకపోతే ఒకటి రెండు పెళ్లిళ్లు కాదు.. ఎన్ని పెళ్లిళ్లు జరిగినా ఎంతమంది భర్తలు వచ్చినా పరిస్థితిలో మార్పు ఉండదనే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news