Moviesవిద్యాబాల‌న్‌ను రూమ్‌కు ర‌మ్మ‌న్న స్టార్ డైరెక్ట‌ర్‌... లోప‌ల‌కు వెళ్లిన ఆమె ఎలా...

విద్యాబాల‌న్‌ను రూమ్‌కు ర‌మ్మ‌న్న స్టార్ డైరెక్ట‌ర్‌… లోప‌ల‌కు వెళ్లిన ఆమె ఎలా ఎస్కేప్ అయ్యిందంటే..!

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే భారతీయ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నోరు విప్పారు. తాము కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు ఎలా ? లైంగిక వేధింపులకు గురయ్యారో అవకాశాల కోసం తమను ఎలా ? వాడుకోవాలని చూశారో. తాము ఎలా వంచనకు గురయ్యారో చాలామంది ఓపెన్ గానే చెప్పారు.

బాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోయిన్లు సైతం ఒక్కొక్కరుగా తమకు జరిగిన విషయాలను బయట పెడుతూ వస్తున్నారు. ఇటు సౌత్ లోనూ తెలుగులో శ్రీరెడ్డి, అటు తమిళంలో సింగర్ చిన్మయి లాంటివాళ్ళు చాలా ఓపెన్ గానే ఈ వేధింపులు గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా పచ్చిపచ్చిగా కూడా లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతున్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ ప్రముఖ న‌టి విద్యాబాలన్ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది.

తాను సినిమాలలోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఆడవాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చాలామంది చెప్పారని.. తాను సినిమాల్లోకి వచ్చి హీరోయిన్‌ అయ్యాక కూడా ఈ వేధింపులు తప్పలేదని ఆమె వాపోయారు. ఒక స్టార్ డైరెక్టర్ ఒక కాఫీ షాప్ లో కలిసి కథ చెప్తాను అని స్టార్ హోటల్‌కు రమ్మన్నాడని.. తీరా అక్కడికి వెళ్ళాక అతడి ఉద్దేశం అర్థం అయిందని విద్య చెప్పింది.

లోపల అతడు క‌థ చెపుతుండ‌గానే.. అత‌డి ఉద్దేశం గ్ర‌హించి.. తాను రూమ్ తలుపులు తెరిచే ఉంచానని.. రూమ్ తలుపులు మూసేందుకు తాను ఇష్టపడకపోవడంతో ఆ డైరెక్టర్‌కు ఏం చేయాలో? తెలియక అక్కడ నుంచి జారుకున్నాడని చెప్పింది. అలా తనకు ఆ స్టార్ డైరెక్టర్ నుంచి క్యాస్టింగ్ అనుభవం ఎదురైనా తాను చాలా తెలివిగా తప్పించుకున్నానని విద్య చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news