రెండున్నర దశాబ్దాల క్రితం టాలీవుడ్లో హీరో సుమన్ అంటే ఓ పాపులర్ హీరో. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన సుమంత్ అప్పటి తరం స్టార్ హీరోలు అందరికి పోటీ ఇచ్చేవారు. సుమన్ మార్షల్ ఆర్ట్స్‌లో ఫేమస్. సుమన్ ఫైట్లు, డ్యాన్సులు, కరాటే అంటే అప్పట్లో యూత్‌కు బాగా పిచ్చి. అప్పట్లో అటు తమిళ్‌తో పాటు ఇటు తమిళంలోనూ సుమన్ స్టార్ హీరోలకు ముచ్చెమటలు పట్టించారు. కారణం ఏదైనా సుమన్ ఓ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లడంతో సుమన్ కెరీర్ దెబ్బతింది
అయితే సుమన్‌ను కావాలనే కొందరు ఈ కేసులో ఇరికించారని.. సుమన్ స్టార్ హీరోగా ఎదగడం ఇష్టం లేక.. కొందరు సినిమా పెద్దలే సుమన్‌ను కావాలని ఈ కేసులో బలి చేసి.. కెరీర్‌ను దెబ్బ కొట్టారని అప్పల్లో బాగా ప్రచారం కూడా జరిగింది. సుమన్ ఈ కేసులో ఇరుక్కోవడం వెనక కూడా అతడి గొప్ప అందమే కారణం. సుమన్ చాలా అంటే చాలా అందంగా ఉండేవాడు. సుమన్‌ను ఇష్టపడే అమ్మాయిల్లో ఆంటీలు, పెళ్లైన వారు కూడా ఉండేవారట.
ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్‌కు కూతురుకు అప్పటికే పెళ్లయ్యింది. ఆమె సుమన్‌ను ఇష్టపడి తనంతట తానే సుమన్ దగ్గరకు వచ్చి పడుకునేదట. అప్పటికే సుమన్‌ను టార్గెట్‌గా చేసిన వాళ్లు ఇదే అదనుగా చూసి మనోడిని కేసులో ఇరికించేశారని అంటారు. జైలు నుంచి బయటకు వచ్చాక సుమన్ కెరీర్ అనుకున్నంత ముందుకు సాగలేదు. ఇకక సుమన్ నీలి చిత్రాలు చేసేవాడంటూ కూడా తమిళ పత్రికలు టార్గెట్ చేస్తూ ఆర్టికల్స్ రాసేవట.
అయితే తెలుగు పత్రికలు తమిళ పత్రికల ఆర్టికల్స్‌కు ధీటైన కౌంటర్లు ఇచ్చేవట. సుమన్ ఊ అనాలే గాని… ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సైతం సుమన్ పక్కన పడుకునేందుకు వస్తారని.. అలాంటి అందగాడికి నీలి చిత్రాల్లో చేయాల్సిన అవసరం లేదని కౌంటర్లు ఇచ్చేవట. అయితే తాను ఏ తప్పూ చేయకపోవడంతో చివరకు బయట పడ్డానని.. తనపై అన్యాయంగా కేసులు పెట్టిన వారి విషయంలో తాను తిరిగి కేసులు వేయాలని నిర్ణయించుకోలేదని నాటి సంఘటనను గుర్తు చేసుకుని సుమన్ బాధపడ్డాడు.