పాత సినిమా ప్రపంచంలో అనేక మంది హీరోలు.. సైలెంట్‌గా ఉండేవారు. అక్కినేని, ఎన్టీఆర్‌ల హయాం లో అయితే.. మిగిలిన హీరోలు ఎన్ని హిట్లు కొట్టినా.. అగ్రతారలుగా అక్కినేని, ఎన్టీఆర్‌లే ఉండేవారు. వీరు మినహా మిగిలిన వారు పెద్దగా బయటకు వచ్చేవారు కాదు. వెండితెరను ఎంత ఏలినా.. చిరంజీవి కూడా అప్పట్లో సైలెంటే. ఎక్కడా బయటకు రావడం.. ప్రకటనలు చేయడం అనేది ఉండేది కాదు.
అయితే.. మురళీమోహన్.. చిన్న సినిమాలకుపెద్దహీరో. ఆయన హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఒకానొక దశలో నిలదొక్కుకున్నారు కూడా. కుటుంబ కథా చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. వారాల అబ్బాయి నుంచి అనేక హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. అనేక మంది హీరోయిన్ల సరసన కూడా ఆయన స్టెప్పులు వేశారు. ఆయన చాలా సైలెంట్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు.
అయితే.. అనూహ్యంగా మురళీ మోహన్‌కు రసికుడు అనే పేరు వచ్చింది. ఇది ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ.. అదేసినిమా ఫంక్షన్‌కు ఎన్టీఆర్ వచ్చారు. మురళీ మోహన్ గురించి మాట్లాడుతూ.. మురళీ మోహన్ గారికి చాలా ఫ్యూచర్ ఉంది. ఆయన రసికుడు
అని ఏక వాక్యంలో అన్నగారు తన ప్రసంగం ముగించారు. దీంతో అప్పటి వరకు ఉద్విగ్నంగా.. ఉన్న సభికులు.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అన్నగారు ఇలా అన్నారేంటా? అని..!
కానీ, కారణం తెలియదు. అన్నగారుఅనేశారు. ఇదే సినిమా పత్రికల్లో పెద్దపెద్ద హెడలైన్స్‌తో వచ్చేసింది. మురళీ మోహన్ రసికుడు: ఎన్టీఆర్
అనే టైటిల్ చాన్నాళ్లు సీరియల్‌గా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు.. సినిమా క్రిటిక్స్ చాలా మంది.. మురళీమోహన్ నటించిన.. సినిమాలు.. ఆయన పక్కన స్టెప్పు లేసిన హీరోయిన్ల గురించి.. కూడా రాశారు.
కానీ, ఎక్కడా.. తన క్రమశిక్షణను మురళీ మోహన్ తప్పలేదు. మరి అన్నగారు రసికుడు అని ఎలా అన్నారు? అంటే.. ఇప్పటికీ.. అది మిలియన్ డాలర్లప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే మురళీమోహహన్ కు ఏ హీరోయిన్‌తోనూ లింక్ ఉన్నట్టు వార్తలు రాలేదు కానీ.. ఒక్క జయచిత్ర విషయంలో మాత్రం ఆయనపై ఈ తరహా పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని ఆయన చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు.