Moviesజాన్వీ చేతిలో చెయ్యి వేసి మరి ఒట్టు వేసిన ఎన్టీఆర్.. అప్పుడు...

జాన్వీ చేతిలో చెయ్యి వేసి మరి ఒట్టు వేసిన ఎన్టీఆర్.. అప్పుడు తాత ..ఇప్పుడు మనవడు..అస్సలు తగ్గట్లేదుగా..!!

అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసినా మూమెంట్ రానేవచ్చేసింది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న మూవీ ఎన్ టీఆర్ 30 లాంచింగ్ పూజా కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. చూడడానికి కన్నుల పండుగలు జరిగిన ప్రారంభోత్సవానికి అతిరధ మహారాధులులు ఎందరో హాజరయ్యారు . మరి ముఖ్యంగా ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ .

కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ . కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా లాంచింగ్ పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమైయాయి. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, యువ సుధ ఆర్ట్స్ సుధాకర్ కలసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అని తెలుస్తుంది . ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవంలో పాన్ ఇండియా కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైట్ షర్ట్ ధరించి, హ్యాట్ పెట్టుకుని స్టైలిష్ గా మెరిశారు. కొరటాల శివ, కళ్యాణ్ రామ్ ఇతర చిత్ర యూనిట్ కూడా హాజరయ్యారు.

కాగా అప్పటివరకు బిక్కు బిక్కున్న బిడియంగా ఉన్న జాన్వి కపూర్ ఎన్టీఆర్ ను చూడగానే ఎమోషనల్ అయిపోయింది . నమస్తే చెబుతూ తన తల్లికి నందమూరి ఫ్యామిలీ పట్ల ఎంత గౌరవం ఉందో చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం జాన్వి చేతిలో చేయి వేసి ఆప్యాయంగా పలకరించారు. ఈ విజువల్స్ చూసిన ప్రతి ఒక్క నందమూరి ఫ్యాన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . గతంలో నందమూరి తారక రామారావు గారు శ్రీదేవి ఎలాంటి స్క్రీన్ టైం ఇచ్చారో..

అదే విధంగా ఉంది ఈ జంట అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఈ జంట తెరపై కనిపిస్తే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అంటూ ఫిక్స్ అయిపోయారు. అంతేనా జాన్వి చాలా పద్ధతిగా చీర కట్టుకున్న ట్రెడిషనల్ లుక్ లో కనిపించడం హైలైట్ గా మారింది . ఏది ఏమైనా సరే అప్పట్లో తాత ఇప్పట్లో మనవడు నందమూరి అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎక్కడా కూడా అస్సలు తగ్గడం లేదు . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news