Moviesనిహారిక - చైత‌న్య విడాకుల ఇష్యూలో భారీ ట్విస్ట్‌...!

నిహారిక – చైత‌న్య విడాకుల ఇష్యూలో భారీ ట్విస్ట్‌…!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదల తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోతుందంటూ ప్రచారం జోరు అందుకుంది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్త వినిపిస్తోంది.. కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక ఇటీవల తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయడం లేదు. అటు చైతన్య కూడా నిహారికతో ఉన్నట్టు ఎక్కడ కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం వీరి పెళ్లి జరిగింది. అప్పటినుంచి వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా.. ఎంతో అన్యోన్యత ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చేవారు.

అయితే కొద్దిరోజులుగా వీరిద్దరి సోషల్ మీడియా ఖాతాలలో ఒకరి ఫోటోలు ఒకరు షేర్ చేసుకోవడం లేదు. దీనికి తోడు చైతన్య పెళ్లి ఫోటోలు సైతం డిలీట్ చేశాడు. నిహారికతో కలిసి గతంలో దిగిన ఫోటోలు కూడా ఇన్‌స్టా ఖాతా నుంచి తొలగించాడు. ఇటు నిహారిక కూడా ఇటీవల తన భర్తతో ఉన్న ఫోటో ఒకటి కూడా తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయలేదు. నిహారికతో దిగిన అన్ని ఫోటోలు డిలీట్ చేసిన చైతన్య ఒక్క ఫోటో మాత్రం అలాగే ఉంచాడు.

అది తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న గోల్డెన్ రీ ట్రైవర్ జాతికి చెందిన కుక్కపిల్ల బజ్‌తో నిహారిక దిగిన ఫోటో కావటం విశేషం. ఈ జంట విడిపోతుందంటూ పుకార్లు.. షికారులు చేస్తున్న నేపథ్యంలో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చైతు ఈ ఒక్క ఫోటో కూడా ఆ కుక్క పిల్ల కోసమే ఉంచాడా.. నిహారిక మిగిలిన అన్ని ఫోటోలు డిలీట్ చేయడం వెనక విడాకుల వార్తలు నిజమేనా ? అన్న సందేహాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి.

ఇక వీరిద్దరి నిశ్చితార్థం 2020 ఆగస్టు 13న జరిగింది. కరోనా కారణంగా పెళ్లి కొంత ఆలస్యం అయ్యింది. అదే ఏడాది డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి వివాహానికి వేదికగా మారింది. ఏదేమైనా రెండేళ్లలోనే ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడం.. విడాకులు అంటూ వార్తలు రావడంతో సినిమా ఇండస్ట్రీ తో పాటు.. మెగా అభిమానులను తీవ్రంగా కలతకు గురిచేస్తుంది. మరి ఇవి నిజమా లేక ?సందేహాలా అన్న ప్రశ్నలకు కాలమే ఆన్సర్ చేయాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news