టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కొద్ది రోజుల క్రితమే మరణించిన విషయం తెలిసిందే . గుండెపోటుతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తారకరత్న సుదీర్ఘంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడి తుది శ్వాస విడిచారు . బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ చికిత్స తీసుకుంటూ మరణించిన తారకరత్న.. మరణాన్ని తెలుగు జనాలు తీసుకోలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ నందమూరి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు .
కుటుంబం కి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు అన్న కారణంతో తారకరత్న ఇన్నాళ్లు దూరం పెట్టిన తండ్రి మోహన్ కృష్ణ ఆయన అంత్యక్రియలను సాంప్రదాయబద్ధంగా జరిపించి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కాగా మొన్న జరిగిన పెద్ద కర్మ లోను అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు . మరి ముఖ్యంగా పెద్దకర్మలో తారకరత్న ఫోటో వద్దకు వెళ్లి ఆయన తారకరత్న ఫోటో వద్ద బోరున ఏడ్చినట్లు తెలుస్తుంది.
చెట్టు అంత కొడుకును అర్ధాంతరంగా కోల్పోయానని.. ఇది నాకు ఎప్పటికీ తీరని శోకంగా ఉండిపోతుందని .. మోహన్ కృష్ణ కుమిలి కుమిలి ఏడ్చాడట . ఈ క్రమంలోనే తారకరత్న ఫోటో వద్ద ఆయన కన్నీళ్లు పెట్టిన దృశ్యాలు నందమూరి కుటుంబ సభ్యులను కదిలిస్తున్నాయి. మొదట నుండి తారకరత్న కి ఆయన అంటే ఎంత ఇష్టమో .. ఆయన మరణించిన తర్వాత బయటపడింది .కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నందమూరి ఫ్యామిలీ ఇన్నాళ్లు నందమూరి తారకరత్న దూరం పెట్టింది అన్న వార్త ఇండస్ట్రీలో దఎప్పటి నుండో వినిపిస్తుంది. కాగా , ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ ఏకమై ఆయన కుటుంబానికి అండగా నిలుస్తుంది..!!