MoviesNandamuri Balayya నందమూరి అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్.. అభిమానులకు మరో...

Nandamuri Balayya నందమూరి అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్.. అభిమానులకు మరో గుడ్ న్యూస్..!!

ఎస్ .. ఇది నిజంగా నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. నందమూరి నట సింహం బాలయ్య వెబ్ సిరీస్లో కనిపించబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు . అభిమానుల కోసం ఎలాంటి రోల్స్నైనా చేయగలిగే హీరో నందమూరి బాలకృష్ణ .. రీసెంట్ గానే అభిమానుల కోసం హోస్ట్ గా.. అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే .

ఈ క్రమంలోనే వరుస సినిమాలకు కమిట్ అయిన బాలకృష్ణ.. రీసెంట్గా వెబ్ సిరీస్ లో కూడా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా కెరియర్ లోనే ఫస్ట్ టైం వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు తెలుస్తుంది . ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనతో నిర్మాత అల్లు అరవింద్ ఓ వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారట .

ఇప్పటికే దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది . దీనిపై రేపో మాపో అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేస్తుంది అంటున్నారు జనాలు. ఒకవేళ నిజంగానే నిజమైతే మాత్రం ఇది నందమూరి అభిమానులకు పండగ చేసుకునే న్యూస్ అనే చెప్పాలి. బాలయ్య లోని మరో కోణం చూడబోతున్నారు అభిమానులు. టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా చేయలేని రికార్డ్ నందమూరి బాలయ్య చేసినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news