గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనందరికీ బాగా తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది . అయితే ఇప్పటివరకు ఈ జంట విడాకులపై అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. అయితే ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు . పెళ్లికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేశారు .
ఈ క్రమంలోనే ఈ జంట కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ మైండ్లో ఫిక్స్ అయిపోయారు మెగా ఫాన్స్. కాగా ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిహారిక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల్లో షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక యంగ్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్ స్టా లో స్టోరీలో రాసుకొచ్చింది .
“హ్యాపీ Birthday సౌరవ్ గారు.. ఈ ఏడాది మీదే ..మీ దర్శకత్వ ప్రతిభ మమ్మల్ని ఆశ్చర్యపరచడం ఖాయం ” అంటూ కామెంట్ పెట్టి ట్యాగ్ చేసింది . ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ హర్ట్ అవుతుంటే .. మరో పిక్ లో హాట్ డేట్ అంటూ తన స్నేహితురాలితో దిగిన ఫోటోను షేర్ చేసింది . కాఫి డేట్ కి తన స్నేహితురాలతో వెళ్లిన నిహారిక అక్కడ హాట్ చాక్లెట్ అంటూ చేతిలో కాఫీ కప్ ను పోస్ట్ చేసింది. బయట ఇలాంటి ప్రచారం జరుగున్న నిహారిక విడాకులపై మాత్రమే ఇంకా స్పందించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అవుతుంది . నిజంగానే నిహారిక విడాకులు తీసుకోబోతుందా..? లేక ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా ..? అన్నది తెలియాల్సి ఉంది . దీనిపై మెగా ఫ్యామిలీ నోరు విప్పితే పూర్తిగా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!