Moviesవాడు క్రిమిన‌ల్ లాయ‌ర్ కాదు… లా చ‌దివిన క్రిమిన‌ల్.. రావ‌ణాసుర ట్రైల‌ర్...

వాడు క్రిమిన‌ల్ లాయ‌ర్ కాదు… లా చ‌దివిన క్రిమిన‌ల్.. రావ‌ణాసుర ట్రైల‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ( వీడియో)

మాస్ మహారాజా రవితేజ రెండు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో ఫామ్‌లో ఉన్నాడు. గ‌తేడాది చివ‌ర్లో ధ‌మాకా, ఈ సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య సినిమాల‌తో రెండు సూప‌ర్ డూప‌ర్ హిట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదే జోష్ కంటిన్యూ చేస్తూ ఈ యేడాది మ‌రో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ర‌వితేజ హీరోగా దక్ష నాగర్కర్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా న‌టించిన సినిమా రావ‌ణాసుర‌.

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకు యువ దర్శకుడు సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ అద‌ర‌గొట్ట‌డంతో పాటు సినిమాపై హైప్ పెంచేశాయి. ఇక ఈ రోజు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను కూడా చాలా గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

అస‌లు ట్రైల‌ర్‌లో కంప్లీట్‌గా థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉన్నాయి. విజువ‌ల్స్ అయితే అదిరిపోయాయ‌నే చెప్పాలి. ర‌వితేజ‌, సుశాంత్ తో పాటు పలువురు ఇతర నటుల లుక్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్… ఇక అదిరిపోయే డైలాగుల‌తో ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమాకు బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ అయితే వ‌చ్చేసిన‌ట్టుగా ఉంది. వాడు క్రిమిన‌ల్ లాయ‌ర్ కాదు… లా చ‌దివిన క్రిమిన‌ల్ అన్న డైలాగ్ ట్రైల‌ర్‌కే హైలెట్‌. ఇక ఈ సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news