Moviesఇంద్రజ కు ఇంత కోపమా..? సౌమ్య ని అందరి ముందే అంత...

ఇంద్రజ కు ఇంత కోపమా..? సౌమ్య ని అందరి ముందే అంత మాట అనేసింది ఏంటి..?

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై పలు షో లు టిఆర్పిఎస్ కోసం ఎలాంటి హంగామా చేస్తున్నారో మనందరికీ బాగా తెలిసిందే. వాటిల్లో మరీ ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో . షో స్టార్ట్ అయిన మొదలు ఇప్పటివరకు టీఆర్పి ల కోసం ఎలాంటి హంగామాలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్గా షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. కమెడియన్స్ హంగామా చేస్తూ షో కి కావాల్సిన టిఆర్పి రేటింగ్స్ ను తెచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు .

ఈ క్రమంలోనే యాంకర్ సౌమ్యకు జడ్జ్ ఇంద్రజల మాటల యుద్ధం నడిచినట్లు ప్రమో ఆధారంగా తెలుస్తుంది. కాగ శ్రీరామనవమి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ లో కమెడియన్స్ అందరూ అదే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు . అంతేకాదు కమెడియన్లు పండగ స్పెషల్ గా పానకాలు తయారు చేశారు . అందరూ చేసిన పాదకాలను ఇంద్రజ టేస్ట్ చేసి ఎవరి పానకం బాగుందో చెప్పాలి . కాగా ఇదే క్రమంలో ఒక్కొక్కరు గ్లాస్ లో పానకం పోయిస్తూ సౌమ్య రావు సర్వ్ చేసింది .

ఈ క్రమంలోని అంతా అయిపోయాక ఇంద్రజ రాఘవ బాగా చేశాడని చెప్పుకొచ్చింది . కానీ అది కాదని వెంకి, తాగుబోతు రమేష్ చేసిన పానకం చాలా బాగుందని సౌమ్య చెప్పుకొచ్చింది. అంతేకాదు మళ్ళి టెస్ట్ చేయించింది . అయితే సౌమ్య రావు అది కాదు అని కృష్ణ భగవాన్ ని ఫైనల్ డెసీషన్ అడిగింది. దీనితో హార్ట్ అయిన ఇంద్రజ ..”సౌమ్య మీరు ఇంతమంది ఒపీనియన్ తీసుకున్నట్లయితే నన్ను అడగాల్సిన అవసరం ఏముంది ..?” అంటూ మొహానే చెప్పేసింది .

దీంతో సౌమ్యరావు మైండ్ బ్లాక్ అయింది . ఇది కరెక్ట్ కాదు అంటూ గట్టిగా అరిచేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి . అంతేకాదు కోపంతో రాఘవ షో మధ్యలో నుంచి వెళ్లిపోయినట్లు చూపిస్తారు. అయితే ఇదంతా స్కిట్లో భాగంగానే అంటూ అందరికీ తెలిసిందే .. కానీ అక్కడ పర్ఫామెన్స్ చేసిన తీరు అందరికీ షాకింగ్ గా అనిపించింది. పండగ పూట ఇలాంటివి అవసరమా అంటూ మండిపడుతున్నారు జనాలు. టిఆర్పి ల కోసం ఏమైనా చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news