టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ అంటే క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. మోహన్ బాబు ఇతర విషయాలలో ఎలా ? ఉన్నా తన వారసులను క్రమశిక్షణతో పెంచారు. అయితే గత కొద్దిరోజులుగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య ఏదో గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. మనోజ్ పెళ్లికి విష్ణు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోవడంతో ఈ అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఇక ఈరోజు మనోజ్ తమ బంధువు సారథి ఇంటిపై అన్న విష్ణు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయటం.. అది వైరల్ కావడం జరిగింది.
మోహన్ బాబు కూడా మనోజ్‌కు వార్నింగ్ ఇవ్వడంతో ఆ వెంటనే మనోజ్ ఆ పోస్టు డిలీట్ చేశాడు. అప్పటికే అది వైరల్ అయిపోయింది. ఈ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య గొడవలు సాధారణమే అని.. అది నిన్న ఉదయం జరిగిన చిన్న ఘటన అని తెలిపాడు. సారధితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు.. అందుకే ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడన్నారు.
మనోజ్ చిన్నవాడు… నా తమ్ముడు, ఆ వీడియో గురించి స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు అంటూ విష్ణు వివరణ ఇచ్చాడు. మరోవైపు అన్నదమ్ముల మధ్య వివాదం గురించి సోదరి మంచు లక్ష్మి కూడా స్పందించారు. తాను విష్ణు, మనోజ్ తో మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో ? చెబుతానని ఆమె తెలిపారు. ఏది ఏమైనా తన ఇద్దరు వారసులు ఇలా గొడవ పడడం… ఆ విషయం వీడియో రూపంలో బయటకు రావడంతో మోహన్ బాబు తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తుంది.