అద్గది అలా ఉండాలి కేరళ ముద్దుగుమ్మంటే.. ఉన్నది ఉన్నట్టు కోపంగా అడిగేస్తూ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీన్ షేక్ చేస్తుంది కేరళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. భీమలా నాయక్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత నటించిన బింబిసార , సార్ చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకుంది.
కాగా ప్రజెంట్ సంయుక్తా మీనన్ తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్ష సినిమాలో కూడా నటిస్తుంది. రీసెంట్గా ఉగాది సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టుర్ ను రిలీజ్ చేసారు. ఈ క్రమంలోనే ఫుల్ ఫైర్ అయిపోయిన సంయుక్త మీనన్ మేకర్స్ చేసిన పనికి హర్ట్ అయ్యింది. అందుకే సోషల్ మీడియా వేదికగా అడిగి కడిగి పారేసింది.
” నేను చాలా డిసప్పాయింట్ గా ఉన్నాను ..నా నిరాశను మీకు వ్యక్తం చేసే ముందు విరూపాక్ష చిత్రంలో ఎంతో మంది గొప్ప నటులు టెక్నీషియన్స్ తో పనిచేసే అవకాశం లభించినందుకు చాలా చాలా హ్యాపీ.. ఈ మెమొరీస్ ఎప్పుడు నేను గుర్తు పెట్టుకుంటూ ఉంటాను .. అయితే వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఎందుకు నన్ను చీట్ చేసింది..? ఇంత బాధ్యతారహితంగా ఉంది..
నా మనసును హార్ట్ చేసింది ..మీరే చెప్పారు నా క్యారెక్టర్ పోస్టర్ ని ఉగాది రోజున రిలీజ్ చేస్తాము అన్నారు.. మాట కూడా ఇచ్చారు.. మరి ఆ పోస్టర్ ఎక్కడ “అంటూ సంయుక్త మీనన్ నిలదీసింది. ఈ క్రమంలోనే స్పందించిన నిర్మాణ సంస్థ సిన్సియర్ క్షమాపణలు కోరుతున్నాం ..ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం అంటూ ఆమెకు రిప్లై ఇచ్చింది. దీనితో వివాదం సర్దుమనిగింది. అయితే సంయుక్త మీనన్ లో ఉన్న ఈ బోల్డ్ యాంగిల్ కి జనాలు ఫిదా అవుతున్నారు . హీరోయిన్స్ నీ లానే ఉండాలి తప్పు చేస్తే తాటతీయాలి అంటూ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!