MoviesBalayya-NTR బాల‌య్య వీర‌సింహారెడ్డి ఎన్టీఆర్ హిట్ సినిమాకు కాఫీయా... ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డ...

Balayya-NTR బాల‌య్య వీర‌సింహారెడ్డి ఎన్టీఆర్ హిట్ సినిమాకు కాఫీయా… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డ నిజం….!

నంద‌మూరి బాల‌కృష్ణ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ వీర‌సింహారెడ్డి. అఖండ త‌ర్వాత బాల‌య్య వ‌రుస‌గా రెండోసారి వీర‌సింహారెడ్డి సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మ‌లినేని గోపీచంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్‌, హానీరోజ్ న‌టించ‌గా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ బాల‌య్య‌కు సోద‌రి పాత్ర‌లో క‌నిపించింది.

ఈ సినిమా తాజాగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతూ దుమ్ముదులిపేస్తోంది. ఈ సినిమాపై సీనియ‌ర్ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ త‌న రివ్యూ చెప్పారు. సినిమా అద్భుతంగా ఉంద‌ని మెచ్చుకుంటూనే బోయ‌పాటి శ్రీను ఈ సినిమా తీసిన‌ట్టుగా ఉంద‌ని ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా చూస్తుంటే తనకు ఎన్టీఆర్ నటించిన చండ‌శాసనలు మూవీ గుర్తుకు వచ్చిందని… ఈ రెండు సినిమాలలో మెయిన్‌ స్టోరీ ఒకటే అని చెప్పారు.

అన్నాచెల్లెళ్ల మధ్య వైరం… అన్నయ్య నాశనం అయిపోవాలని చెల్లి శపించడం లాంటి అంశాలు రెండు సినిమాల్లోనూ ఉన్నాయని పరిచూరు చెప్పారు. వీర సింహారెడ్డి సినిమాలో తాను కోరుకున్న వాడిని చంపించి వేసాడన్న కోపంతో.. అన్నయ్య శత్రువుతోనే తాళికట్టించుకొని వాళ్ల సాయంతో సొంత అన్న మీద పగ తీర్చుకోవాలని వరలక్ష్మి చూస్తుందని… బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు ఇది చాలా బాగా సెట్ అయిందని ప‌రుచూరి చెప్పారు.

ఇక సినిమా ఫస్ట్ అఫ్ చూసినంత సేపు ఇది బోయపాటి శ్రీను సినిమా చూస్తున్నట్టుగానే ఉందని… ఫస్ట్ అఫ్ బంగారంగా ఉంటే.. సెకండ్ హాఫ్ బంగారానికి వెండికి మధ్యలో ఉన్నట్టు అనిపించిందన్నారు. ఒక భయంకరమైన పులి గాండ్రింపులు విన్నాక…. అది సడన్గా కామ్ అయిపోయి.. చెల్లిని చూసి తోక ఆడిస్తే ఎవరికీ చూడ బుద్ధి కాదని… అయినా కూడా అన్నాచెల్లెళ్ల అనుబంధమే ఈ సినిమాను కాపాడిందని ఆయన చెప్పారు.

ఈ సినిమాలో వీరసింహారెడ్డి పాత్ర ముగించిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ చూపించటం అట‌. కొన ఊపిరితో ఉన్నప్పుడు చిన్న బాలయ్యకు ఫ్లాష్ బ్యాక్ చెప్పి… అతడు విలన్ ను చంపేసి అత్త‌, తండ్రికి సమాధులు కట్టినట్టు చూపించి ఉంటే బాగుండేదని పరుచూరి అభిప్రాయపడ్డారు. ఇక ఎన్టీఆర్ చండ‌శాస‌నుడు కూడా అన్నాచెల్లి సెంటిమెంట్‌తోనే న‌డుస్తుంది. ఇది 1983లో వ‌చ్చింది.

రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఎన్టీఆర్‌, శార‌ద‌, స‌త్య‌నారాయ‌ణ‌, రాధ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. చ‌క్ర‌వ‌ర్తి స్వరాలు అందించారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి కావ‌డానికి ముందు ఆయ‌న న‌టించిన చివ‌రి సినిమా. ఈ సినిమా తెలుగులో సూప‌ర్ హిట్ కాగా… తమిళంలో దీనిని సరితిరా నాయగన్గా రీమేక్ చేయ‌గా.. అక్క‌డ కూడా హిట్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news