Moviesనైట్ అలాంటి పనులు చేస్తున్న త్రివిక్రమ్.. ఈ వయసులో అలాంటి సాహసాలు...

నైట్ అలాంటి పనులు చేస్తున్న త్రివిక్రమ్.. ఈ వయసులో అలాంటి సాహసాలు అవసరమా గురువు గారు..!?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారాలి అన్న .. స్టార్ గా మారిన తర్వాత ఆ స్టేటస్ పదికాలాలపాటు చల్లగా ఉండాలి అన్న.. డైరెక్టర్స్ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వాలంటే స్టార్ హీరోస్ తమ బాడీను.. ఫిజిక్ ను ఎంత కంట్రోల్ లో పెట్టుకోవాలో ..డైరెక్ట్ర్ లు.. తమ మైండ్ అంత కంట్రోల్ లో పెట్టుకొని కథలు రాయాల్సి ఉంటుంది . రాసిన కథలను జనాలకు నచ్చే విధంగా తెరకెక్కించాల్సి ఉంటుంది. ఆ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .

పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి విజువలైజేషన్స్ లో ..గ్రాఫిక్స్ లో ..ఎంత ధిట్టనో అలాగే ఫ్యామిలీ కంటెంట్ తెరకెక్కించాలన్న ఫ్యామిలీస్ కడుపుబ్బ నవ్వించాలన్న.. ఎంటర్టైన్ చేయాలన్న.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తర్వాతే ఎవరైనా అని చెప్తూ ఉంటారు జనాలు. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ టైటిల్ ని రిలీజ్ చేయబోతున్నాం అంటూ మేకర్స్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల , పూజా హెగ్డే సెలక్ట్ అయ్యారు అంటూ అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది.

ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చాలా కేరింగ్ తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఇప్పటివరకు టచ్ చేయని మేటర్ ని ఈ సినిమాలో పెట్టి మహేశ్ కెరీర్ లోనే ఓ సంచలనానికి తెర తీయ్యబోతున్నాడు అంటూ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రాత్రి పగలు అంటూ తేడా లేకుండా నిద్ర మేల్కొని మరి కథలో కొత్త పాయింట్స్ ని యాడ్ చేస్తున్నారట .

సినిమాకి భారీ హైప్ ఇవ్వడానికి నేటి సమాజంలో ఇంట్రెస్టింగ్ గా మారిన పాయింట్ను బేస్ చేసుకొని తనదైన స్టైల్ లో డైలాగులు రాస్తున్నారట . ఈ క్రమంలోనే రాత్రి నిద్రపోవడమే మానేశారట . రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పేపర్ పెన్ను పట్టుకొని ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈ వయసులోనూ సినిమా హిట్ అవ్వడానికి ఇంత కష్టపడుతున్నాడా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . మరికొందరు నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news