Movies"కట్టుకున్న మొగుడు కూడా ఎప్పుడు ఆ పని చేయలేదే..సమంత విషయంలో ఆయన...

“కట్టుకున్న మొగుడు కూడా ఎప్పుడు ఆ పని చేయలేదే..సమంత విషయంలో ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించాడా….?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీం రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో సమంత వేసుకున్న నగల గురించి అసలు విషయాన్ని బయటపెట్టింది .

శాకుంతలం సినిమాలో శకుంతల దేవి పాత్రలో కనిపించబోతున్న సమంత వేసుకున్న ఆభరణాలన్నీ ఒరిజినల్ బంగారం, వజ్రాలవే అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ గుణశేఖర్. శకుంతల , దుష్యంతుడు ధరించిన బంగారం ..వజ్రాల ఆభరణాలు ..దుస్తులను వసుంధర జువెలరీ వారే తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు గుణశేఖర్. కాగా అప్పట్లో నందమూరి తారక రామారావు గారి నటించిన దానవీరశూరకర్ణ సినిమాలో ఆయన ధరించినవన్ని ఒరిజినల్ ఆభరణాలు అట. ఆ సినిమాని స్పూర్తిగా తీసుకొని గుణశేఖర్ ఈ సినిమా కోసం ప్రతి ఒక్క నగను ఒరిజినల్ గానే చేయించారు అంటూ చెప్పకు వచ్చారు.

ఈ సినిమాలో శకుంతల దేవి పాత్రలో నటించిన సమంత పాత్రకి 15 కేజీల బంగారంతో పాటు 14 రకాల ఆభరణాలను తయారు చేయించారట . అలాగే దుష్యంతుడి పాత్ర కోసం దాదాపు పది కేజీల బంగారం ఆభరణాలను చేయించారని ..మేనకా పాత్రధారి అయిన మధుబాల పాత్ర కోసం 6 కోట్ల రూపాయలతో వజ్రాలు పొదిగిన దుస్తులను బంగారు ఆభరణాలను తయారు చేయించామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి అవే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాయని.. డైరెక్టర్ గుణశేఖర్ దీమా వ్యక్తం చేశారు . ఈ వార్త తెలుసుకున్న సామ్ అభిమానులు నాగచైతన్య కూడా ఎప్పుడు కట్టుకున్న భార్య సమంత కోసం ఇన్ని నగలు చేయించి ఉండరని.. సమంత పట్ల గుణశేఖర్ తీసుకున్న కేర్.. చేసిన హెల్ప్ ఎప్పటికి మర్చిపోలేనిది అని చెప్పుకొస్తున్నారు. దీంతో మరోసారి నాగచైతన్య సమంతల విడాకుల మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news