Moviesతారక్ హ్యాపినెస్ కోసం కొరటాల శివ మరో ఖతర్నాక్ ప్లాన్.. నందమూరి...

తారక్ హ్యాపినెస్ కోసం కొరటాల శివ మరో ఖతర్నాక్ ప్లాన్.. నందమూరి అభిమానులు ఎగిరి గంతులెయాల్సిందే..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే పూర్తయ్యాయి . సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నట్లు ఇప్పటికే ఒక క్రేజీ న్యూస్ లీక్ అయ్యి వైరల్ అవుతుంది. అంతేకాదు ఇన్నాళ్లు ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అంటూ వెయిట్ చేస్తున్న అభిమానులకు..సినిమా నుంచి లీక్ అవుతున్న కొన్ని కొన్ని పిక్స్ కొత్త ఊపు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులను సైతం రంగంలోకి దించాడు కొరటాల శివ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు ఈ సినిమాల్లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు అంటూ తెలుస్తుంది . అయితే ఎప్పటినుంచో ఎన్టీఆర్ కి ప్రకాష్ రాజ్ తో ఢీ అంటే ఢీఅనే పాత్రలో నటించాలి అనే కోరిక ఉందట . కాగా ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరబోతుంది. ఎస్ ఈ సినిమాల్లో ప్రకాష్ రాజ్- ఎన్టీఆర్ కు విలన్ గా నటించబోతున్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడట.

ఈ క్రమంలోనే సెకండ్ హాఫ్ లో వచ్చే భారీ యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా మారబోతున్నాయి అంటూ ఒక క్రేజీ టాక్ వైరల్ అవుతుంది. అంతేకాదు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ – ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సీన్స్ కోసం స్పెషల్ గా డైలాగ్స్ రాయిస్తున్నాడట కొరటాల . ఈ క్రమంలోనే తారక్ మరో ఆది లాంటి సినిమా టైమ్ కి తీసుకెళ్ళిపోతున్నాడు కొరటాల శివ . నిజంగా ఇది నిజం అయితే మాత్రం తెరపై ఎన్టీఆర్ – ప్రకాష్ రాజ్ లు పెర్ఫార్మెన్స్ అదిరిపోవాల్సిందే అంటున్నారు నందమూరి అభిమానులు . ఇప్పటికే చాలా సినిమాల్లో తారక్-ప్రకాష్ రాజ్ నతించారు.. కానీ ఈ సినిమాలో మాత్రం వేరే లేవల్ అంటూ ఓ టాక్ వైరల్ అవుతుంది..!!అంతేకాదు ఈ సినిమా లో ఇప్పటివరకు మనం కని విని ఎరుగని తారక్ ని చూడబోతున్నామంటూ కూడా టాక్ వినిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని తిరగరాస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news