Movies30 ఏళ్ల క్రిత‌మే బికినీతో ఇండ‌స్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్లు...

30 ఏళ్ల క్రిత‌మే బికినీతో ఇండ‌స్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. అంతా సోషల్ మీడియా యుగం అయిపోయింది. ఒకప్పుడు గ్లామర్ షో చేయాలన్నా.. బికినీ వేయాలన్నా… అందాలు ఆరబోయాలన్నా.. సినిమాలు మాత్రమే సాధనంగా ఉండేవి. ఎవరైనా గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలగాలని అనుకుంటే.. వాళ్లు వెండితెరమైతే మాత్రమే అందాలు ఆరబోస్తే బాగా పాపులర్ అయ్యేవారు. అయితే ఇప్పుడు అదేం అవసరం లేదు. బికినీ వేయాలన్న.. అందాలు చూపించాలన్న సోషల్ మీడియా ఉంటే చాలు.

సోషల్ మీడియాలో అందాల ఆరబోత, బికినీ ఫోటోలు వదిలితే చాలు నిమిషాల్లోనే అవి వైరల్ అయిపోతున్నాయి. కోట్లాదిమందికి రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు బాగా పాపులర్ అవ్వాలనుకునే వాళ్లకు ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అయితే 20 – 30 సంవత్సరాల క్రితం సోషల్ మీడియా లేదు. అప్పుడు బికినీ వేయాలి అన్నా.. గ్లామర్ గా పాపులర్ అవ్వాలన్నా కేవలం సినిమా మాత్రమే సాధనం. ఇప్పుడు స్టార్ హీరోయిన్ల నుంచి మిడిల్ రేంజ్ హీరోయిన్ల వరకు అందరూ అందాలు ఆరోబోసేస్తున్నారు. సోష‌ల్ మీడియాతో పాపుల‌ర్ అయ్యి ఛాన్సులు ద‌క్కించుకుంటున్నారు.

ఇప్పుడు అంటే బికినీ వేసినా పెద్దగా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు. అప్ప‌ట్లో బికినీ వేయ‌డం అంటే పెద్ద సంచ‌ల‌నం. అప్ప‌ట్లో బికినీ వేసిన కొంద‌రు స్టార్ హీరోయిన్లు.. ఆ స్టిల్స్ చూస్తే నిజంగానే మ‌తులు పోతాయి.
జ‌య‌సుధ‌:
స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ అప్ప‌ట్లోనే బికినీ వేసి పెద్ద సంచ‌ల‌నం రేపారు. అస‌లు ఆమె బికినీ అందాలు ఇన్నేళ్ల‌కు ఇప్పుడు చూసినా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటాయి.
శ్రీదేవి:
దివంగ‌త అతిలోక అందాల సుంద‌రి శ్రీదేవి కూడా గ్లామ‌ర‌సం బాగానే పండించేవారు. ఆమె బికినీ అందాలు కూడా అప్ప‌ట్లో కుర్రాళ్ల‌కు మంచి ట్రీట్‌.
మంజుల‌:
ఇక మంజుల అందం అంటే అప్ప‌ట్లో ఓ మాయ‌లా ఉండేది. అప్ప‌ట్లో ఆమె ఓ సినిమాలో వేసిన బికినీ అందాలు.. హైలెట్ అయ్యాయి. ఇక మంజుల ముగ్గురు కూతుళ్లు కూడా హీరోయిన్లు అయ్యారు.

న‌గ్మా :
అరేబియ‌న్ గుర్రం న‌గ్మా ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా అందాలు ఆర‌బోసేది. ఆమె అందాల కోస‌మే కుర్ర‌కారు థియేట‌ర్ల‌కు వెళ్లేవారు.
మాధ‌వి :
క‌మ‌ల్ హాస‌న్ టిక్ టిక్ టిక్ సినిమాలో మాధ‌వి చేసిన బికినీ షో ఓ సంచ‌ల‌నం అయ్యింది.
రాధ :
అదే క‌మ‌ల్ హాస‌న్ టిక్ టిక్ టిక్ సినిమాలో మాధ‌వితో పాటు రాధ కూడా బికినీ వేసింది.

ఇక 1990, 200వ ద‌శ‌కంలో తెలుగు సినిమాను, సౌత్ సినిమాను ఒక ఊపు ఊపేసిన సిమ్రాన్ – రంభ – సంఘ‌వి – రాశి – ర‌మ్య‌కృష్ణ – మీనా లాంటి హీరోయిన్లు కూడా బికినీ షో చేసిన వారే.
ఇక 1990ల్లో స్టార్ హీరోయిన్‌, నాగార్జున భార్య అమ‌ల కూడా బికినీ వేసిన చ‌రిత్ర ఉంది. ఇక ఐటెం సాంగుల‌తో కుర్ర‌కారుకు యేళ్ల‌కు యేళ్ల పాటు నిద్ర లేకుండా చేసిన సిల్క్ స్మిత ఎన్నో సినిమాల్లో అందాలు చూపించేది. ఆమె బికినీ స్టిల్స్ కూడా అప్ప‌ట్లో బాగా ఫేమ‌స్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news