గుడివాడ వెళ్లాను… గుంటూరు వెళ్లాను ఇలాంటి ఐటెం సాంగ్.. శృంగార గీతాలకు 1970 – 80వ దశలో జయమాలిని ఎంత ఫేమస్సో తెలిసిందే. అసలు జయమాలిని ఐటెం సాంగ్స్ చూసేందుకే చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు లొట్టలు వేసుకుని మరీ వెళ్లేవారు. దీనిని బట్టే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. 1970 – 90వ దశంలో 20 ఏళ్లపాటు జయమాలిని సౌత్ ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపేశారు. జయమాలిని ఐటెం సాంగ్స్ అదిరిపోయేవి.. ఆమె నడుము ఊపుతుంటే థియేటర్లలో విజిల్స్ మారుమోగేవి. ఆమె అసలు పేరు అలమేలుమంగ. ఆమె తల్లి వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడంతో ఈ పేరు పెట్టారు.
బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఆమె వచ్చారు. జయమాలిని మేనత్త టీఆర్ రాజకుమారి 1950వ దశకంలో తమిళంలో అగ్ర నటి. ఆమె చంద్రలేఖ – హరిదాసు లాంటి సినిమాల్లో నటించారు. ఆమె మావయ్య టిఆర్ రామన్న ప్రముఖ దర్శకుడు. ఆర్ఆర్ ప్రొడక్షన్ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు. జయమాలినికి తెలుగులో విఠలాచార్య తొలి అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆడదాని అదృష్టం సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయమని అడిగారు.
అదే ఆమె తెలుగులో నటించిన తొలి సినిమా. ఆమెకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. అప్పటికే ఆమె సోదరీ జ్యోతిలక్ష్మి ఐటమ్ సాంగులో నటిస్తోంది. ఆమెకు డ్యాన్సు నేర్పేందుకు ఇంటికి వచ్చిన గురువుల వద్ద జయమాలిని కూడా డ్యాన్స్ నేర్చుకుంది. ఆ సమయంలో వీరింటికి వచ్చిన సీనియర్ దర్శకుడు కె ఎస్ ఆర్ దాస్ ఆమెను చూసి.. ఈ అమ్మాయిని పెట్టి తాను కూడా సినిమా తీస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆ తర్వాత దాస్ తన సినిమాలలో ఆమెకు చాలా అవకాశాలు కల్పించారు.
సినిమాలుకు గుడ్ బై చెప్పాక జయమాలిని పోలీస్ శాఖలో పనిచేసిన పార్తిబన్‌ను పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయింది. ఆమె అందాన్ని చూసిన ఎంతోమంది సినిమా ప్రేమికులు ఆమెకు లవ్ లెటర్లు రాసేవారట. ఆమెను ప్రేమిస్తున్నానని ఎంతోమంది వెంటపడే వారట. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నవారు కూడా పెళ్లి చేసుకుంటామని వెంటపడేవారట. ఇక మలయాళంలో రాజన్ అనే సినీ ప్రముఖుడు ఏకంగా జయమాలిని తల్లి వద్దకు వచ్చి మరి పెళ్లి చేసుకుంటానని వేడుకున్నారట.
వయసులో ఆయన జయమాలిని కంటే ఏకంగా 22 సంవత్సరాలు పెద్దవాడు. దీనిని బట్టి జయమాలిని అప్పట్లో ఎంతో మంది హృదయాలను గొల్లగొట్టిందనేది అర్థమవుతుంది. ఇక జయమాలిని కూడా యంగ్ ఏజ్‌లో ఉండగానే ఒక వ్యక్తిని ప్రేమించాను అని.. తాను కూడా ఆయన ప్రేమకు ఆకర్షితురాలని అయ్యానని చాలా ఏళ్ల తర్వాత ఆ సీక్రెట్ బయటపెట్టింది. అయితే ఆ వ్యక్తి పేరు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. ఎవరైనా యుక్త వయస్సులో హార్మోన్ల ప్రభావంతో ప్రేమకు ఆకర్షితులు అవుతారని ఆమె చెప్పటం విశేషం.