రక్త కన్నీరు
ఇది ఒకప్పుడు దాదాపు 30 సంవత్సరాలు నిత్యం నాటకంగా ప్రదర్శింపబడింది. ఈ నాటకం లో నటించిన వారే అనేక మంది తర్వాత కాలంలో సినీ తెరపై విస్తారంగా అవకాశాలు దక్కించుకున్నారు. అంతేకాదు.. ఈ నాటకం కోసం.. సినిమా షెడ్యూళ్లను కూడా మార్చుకుని మరీ నటించిన వారు కూడా ఉన్నా రు. ఈ నాటకానికీ.. సినిమా నటులకు అంత అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది.
ఇలా.. రక్తకన్నీరు నాటకాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని, దానిని గర్వంగా చెప్పుకొన్న నటుడు నాగభూ షణం. ఆయనను అందరూ రక్తకన్నీరు నాగభూషణం అనే పిలిచేవారు. అలా పిలిపించుకోవడమే తనకు సైతం ఆనందంగా ఉండేదని అనేవారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు విలన్‌గా ఆయన ప్రఖ్యాతి సంపా యించుకున్నారు. అలాంటి నాగభూషణం.. చివరి రోజుల్లో రక్తకన్నీరు కార్చారని అంటారు ఆయన మిత్రులు.
నాగభూషణం ఫామ్‌లో ఉన్నన్నీ రోజులు బాగా సంపాదించుకున్నారు. రెమ్యునరేషన్లతో బాగానే కూడబెట్టుకున్నారు. అయితే చివరి రోజుల్లో ఆయనకు “చేతుల్లో మిగిలిందిఏమీలేదు. జల్సాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసేవారు. అదేమంటే.. జీవితం మళ్లీ రాదోయ్ మిత్రమా..! అని డైలాగులు పేల్చేవారు. ఆయన తాగే ఒక్కసిగరెట్ ఖరీదు.. అప్పట్లోనే 10 రూపాయలు ఉండేది.
అలాంటి పెట్టెలు మూడు నుంచి నాలుగు తాగేవారు. సాయంత్రం షూటింగ్ అయిపోగానే మిత్రులతో కలిసి క్లబ్బులు.. బార్లు.. చివరకు ఏమీ మిగుల్చుకోకుండా.. నానా ఇబ్బందులు పడ్డారు“ అని గుమ్మడి వివరించారు. అలానే పోయారని.. తామే కొంత డబ్బు సమకూర్చి సంస్కారం చేశామని వివరించారు.