Moviesబాల‌య్య మిస్ అయ్యాడు... వెంకీ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు... ఆ సినిమా ఇదే..!

బాల‌య్య మిస్ అయ్యాడు… వెంకీ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు… ఆ సినిమా ఇదే..!

టాలీవుడ్ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి హిట్ కొట్టడం ఎన్నో సందర్భాల్లో జరిగింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ మధ్య 20 ఏళ్ల క్రితం ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. బాలకృష్ణ చేయాల్సిన ఒక హిట్ సినిమా.. అనూహ్యంగా వెంకటేష్ ఖాతాలో చేరిపోయింది. కట్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు వెంకటేష్ కు యూత్‌లో తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎన్నో సినిమాల‌కు పనిచేశారు జయంత్ సీ ప‌రాంజీ. ఆయనను డైరెక్టర్ చేస్తానని నిర్మాత సురేష్ బాబు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రెండు మూడు కథలు కూడా జయంత్‌ రాసుకున్నారు. అలా జయంత్ వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా సినిమా తెరకెక్కించారు. ఆయ‌న‌కు అదే తొలి సినిమా. ఈ సినిమాతోనే అంజలా ఝ‌వేరి టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈ సినిమా ఒక క్యూట్ లవ్ స్టోరీగా తెర‌కెక్కి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

వాస్తవానికి సమరసింహారెడ్డి రాయలసీమ రియాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమా అయినా.. అంతకంటే ముందు ప్రేమించుకుందాం రా సినిమాలో కూడా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని జగన్ చూపించారు. అయితే ప్రేమించుకుందాం రా సినిమా యాక్షన్ కంటే ఎక్కువుగా ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే జయంత్‌ ఈ సినిమాను ముందుగా బాలయ్య బాబుతో చేయాలని అనుకున్నారట.

అయితే మధ్యలో సురేష్ బాబుకు కథ చెప్పడం… ఆయన వెంకటేష్ తో చేయాలన‌డంతో ఇక జయంత్ కాదనలేకపోయారు. ఒకవేళ బాలయ్య ఈ సినిమా చేసి ఉంటే ఆయన ఖాతాలో మంచి హిట్ సినిమాగా నిలిచేద‌ని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. బాలయ్యకు ఇలాంటి లవ్ స్టోరీ సెట్ కాకపోయినా.. ఈ సినిమాలో యాక్షన్ నేపథ్యం ఉండడంతో అది ప్ల‌స్ అయ్యేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆ సినిమా బాల‌య్య చేయాల‌నుకున్న జ‌యంత్ త‌న కోరిక‌ను ల‌క్ష్మీన‌ర‌సింహా, అల్ల‌రి పిడుగు సినిమాల‌తో నెర‌వేర్చుకున్నారు. బాల‌య్య – జ‌యంత్ కాంబోలో వ‌చ్చిన ల‌క్ష్మీ న‌ర‌సింహా కోలీవుడ్ హిట్ మూవీ సామీకి రీమేక్‌గా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక అల్ల‌రి పిడుగు సినిమా 2005లో తెర‌కెక్కింది. క‌త్రీనాకైఫ్‌, ఛార్మీ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news