Moviesపాపం..సినిమా ఆఫ‌ర్లు లేక‌ అమ్మ అలా..డాటర్ ఇలా..? ఈ తల్లి...

పాపం..సినిమా ఆఫ‌ర్లు లేక‌ అమ్మ అలా..డాటర్ ఇలా..? ఈ తల్లి కూతుర్ల పరిస్ధితి ఎంత దారుణంగా ఉందంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన తర్వాత ఆ పేరుని అలాగే కొనసాగించడం ముఖ్యం . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చామా..? నాలుగు సినిమాలు చేశామా..? అంటూ కొందరు స్టార్ట్ డాటర్స్ సైలెంట్ అయిపోతున్నారు . అదే లిస్టులోకి వచ్చేస్తుంది అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ రాధ కూతురు నటి కార్తీక నాయర్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అక్కినేని నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ తో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కార్తీక.. మొదటి సినిమాతో పర్లేదు అనే టాక్ ను అందుకుంది.

ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . కాగా ఆ తర్వాత జీవాకు జోడిగా నటిచిన ” రంగం” సినిమా ఒక్కటి సూపర్ డూపర్ హిట్ అయింది . అయినా కానీ అమ్మడుకు అవకాశాలు రాలేకపోయాయి . ఈ క్రమంలోనే కార్తీక కెరియర్ గ్రాఫ్ దెబ్బకు పడిపోయింది . సినిమా ఆఫర్ లు లేకపోవడంతో కార్తీక సోషల్ మీడియాలో గ్లామర్ షో ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినా ఎందుకో కార్తీక కి అవకాశాలు ఇవ్వలేకపోయారు డైరెక్టర్ లు.

ఈ క్రమంలోనే కార్తీక పేరు కనుమరుగైపోయింది . కాగా ప్రజెంట్ కార్తీక బిజినెస్ రంగంలో అడుగు పెట్టింది . ఉదయ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తన కెరియర్ను ముందుకు తీసుకెళ్తుంది. ఆ సంస్థ వ్యాపార కార్యకలాపన అభివృద్ధి చేయడంలో కొన్ని సంవత్సరాలుగా కార్తీక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తామనుకున్న రాధా కెరియర్ కూడా డిజాస్టర్ గా మారింది .ఫిజిక్ మారిపోవడంతో డైరెక్టర్ లు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే బుల్లితెరపై షోలకు జడ్జిగా చేస్తుంది. మాటీవీలో ప్రసారమవుతున్న బీబీ జోడి కు ఆమె వన్ ఆఫ్ ద జడ్జ్ గా వ్యవహరిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ లేక ఈ తల్లి కూతుర్లు పడుతున్న తిప్పలు చూసి జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news