Moviesకళ్లు చెదిరే ఆఫర్ అందుకున్న శ్రీలీల.. కెరీర్ లోనే కని విని...

కళ్లు చెదిరే ఆఫర్ అందుకున్న శ్రీలీల.. కెరీర్ లోనే కని విని ఎరుగని ఛాన్స్..ఏం లక్ పిల్ల నీది..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పట్టిందల్లా బంగారమే అన్నట్టు అమ్మడు చేసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మేకర్స్ కూడా అమ్మడును అదృష్ట దేవతగా భావిస్తున్నారు . అయితే శ్రీలీల క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ ల కి మించిపోయింది. ఇప్పటికే శ్రీలీల తన ఖాతాలో బడా బడా ఆఫర్లను రెడీగా పెట్టుకుని ఉంది.

కాగా రీసెంట్ గా శ్రీలీల మరో జాక్ పాట్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కబోతున్న మహేష్ బాబు సినిమా లో అమ్మడు కీ రోల్ లో కనిపించబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే త్రివిక్రమ్ -మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. ఇదే క్రమంలో మరోసారి మహేశ్ లాంటి బడా హీరో తో ఆఫర్ అందుకుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

ఒకవేళ నిజంగా ఇది నిజమే అయితే మాత్రం శ్రీలీల దశ తిరిగిందని చెప్పాలి. ఇప్పటివరకు స్టేట్ వారీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల ఈ సినిమాలో నటిస్తే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంటుంది అంటున్నారు ఫ్యాన్స్ . చూడాలి మరి ఈ సినిమా ద్వారా ఎలాంటి హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందో ఈ ముద్దుగుమ్మ. ఒకటి మాత్రం నిజం పాపకు భీబత్సంగా లక్ ఉంది అంటూ జనాలు టార్గెట్ చేసి శ్రీలీల పేరును ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news