Moviesమెగా కోడలు పై కోట్లల్లో బెట్టింగ్..? ఛీ ఛీ ఆఖరికి ఇంతలా...

మెగా కోడలు పై కోట్లల్లో బెట్టింగ్..? ఛీ ఛీ ఆఖరికి ఇంతలా దిగజారిపోయారా రా..?

ప్రజెంట్ మెగా ఫ్యామిలీ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ బాగా తెలిసిందే. గత 48 గంటల నుంచి మెగా డాటర్ నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే దీనిపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ కానీ జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కానీ ఏ విధంగా స్పందించలేదు . కానీ మెగా డాటర్ విడాకులు తీసుకోబోతుంది అంటూ మాత్రం జనాలు ఫిక్స్ అయిపోయారు .

దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గానే జొన్నలగడ్డ చైతన్య తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేశారు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మెగాకోడలు పేరు కూడా మారుమ్రోగిపోతుంది. గత పదేళ్లుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన గుడ్ న్యూస్ ని ఎట్టకేలకు అభిమానులకు వినిపించింది ఉపాసన.

తల్లి కాబోతున్నాను అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . ఈ క్రమంలోనే మెగా వారసుడు అయిన రామ్ చరణ్ కు పాప పుడుతుందా..? బాబు పుడతారా..? అంటూ ఇంట్రెస్టింగ్ పోల్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి . అయితే కొందరు మాత్రం పూర్తిగా హద్దులు మీరి బెట్టింగ్లు వేస్తున్నారు . అంతా ఇంతా కాదు మొత్తంగా కోట్లల్లో మెగా వారసులపై బెట్టింగ్ పెడుతుండడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .ఈ క్రమంలోనే కొందరు జనాలు ఇలా కూడా డబ్బులు సంపాదిస్తున్నారా..? ఇంత దిగజారిపోయారా..? అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news